రెండు నెలలైన సిద్దం కానీ పాక్ ఎయిర్ బేస్ లు
తాజాగా మరోసారి నోటెమ్ జారీ చేసిన ఇస్లామాబాద్, ఆపరేషన్ సిందూర్ ఫలితం;
By : Praveen Chepyala
Update: 2025-07-19 06:51 GMT
ఆపరేషన్ సిందూర్, తదనంతర సైనిక ఘర్షణల్లో పాక్ వైమానిక దళానికి భారీ స్థాయిలో నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దాయాదీ దేశంలోని 11 స్థావరాలపై భారత్, బ్రహ్మోస్ మిస్సైల్ లతో విరుచుకుపడటంతో ముష్కర దేశం బిత్తరపోయి కాళ్లబేరానికి వచ్చింది.
ఇప్పడు మరోసారి ఆ దేశం వార్తల్లోకి వచ్చింది. ఆ దేశంలోని రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరంలో ఉన్న రన్ వే పై సైనిక ఘర్షణల్లో నిలుపులోతు గోతులు ఏర్పడ్డాయి. గత రెండు నెలలుగా దానిని మరమ్మతులు చేసిన పనిపూర్తి కాకపోవడంతో మరోసారి విమానాశ్రాయాన్ని మూసివేస్తూ ఇస్లామాబాద్ ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ మీడియా కథనం ప్రకారం పాకిస్తాన్ లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన ఎయిర్ మెన్ లేదా నోటమ్(ఎన్ఓటేఏమ్) కు నోటీస్ అందించింది. దీని ప్రకారం వచ్చే నెల ఆరవ తేదీ ఉదయం 4.49 వరకూ రన్ వే లో విమాన కార్యకలాపాలు జరగకుండా మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది.
రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరం పై భారత్ దాడి చేసిన తరువాత రోజు తరువాత ఆదేశం అప్పట్లో నోటెమ్ జారీ చేసింది. ఒక వారం పాటు విమానాశ్రయంలో సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అప్పట్లో పేర్కొంది. ఇది జరిగి రెండు నెలలు పూర్తయిన ఇప్పటి వరకూ మరమ్మతులు చేయలేకపోయింది పాకిస్తాన్.
పని జరుగుతోంది..
విమానాశ్రయా రన్ వే మరమ్మతు పనుల కోసం పాక్ ఇప్పటికే అనేక నోటమ్ లు జారీ చేసింది. పనిలో పురోగతి ఉందని పేర్కొన్నప్పటికీ భారత వాయు సేన చేసిన దాడుల వల్ల తాము అనుకున్న దానికన్నా భారీ స్థాయిలో విధ్వంసం జరిగిందని అందుకే ఎక్కువ సమయం పడుతున్నట్లు పాక్ అధికారులు చెబుతున్నారు. అయితే మునపటి నోటమ్ కు ప్రస్తుత నోటీసుల జారీకి మధ్య ఎలాంటి అదనపు సమాచారం కూడా పాక్ జత చేయలేకపోయింది.
ఎయిర్ బేస్..
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ దక్షిణ ప్రాంతంలో ఉన్న రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ వైమానిక దళం ఫార్వార్డ్ ఆపరేషనల్ ఎయిర్ బేస్ గా, పౌర విమానాల కోసం షేక్ జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా ఉపయోగిస్తున్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. భారత సైన్యం విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు, రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరంలోని ఏకైక రన్ వే మధ్యలో పెద్ద లోతైన గొయ్యిని చూపించాయి. ఈ చిత్రాల్లోనే వైమానిక స్థావరంలోని ఒక భవనం మొత్తం కుప్పకూలినట్లు కూడా ఉంది.
సిందూర్ ఎందుకంటే..
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ కి వెళ్లిన టూరిస్టులో కేవలం హిందువులను మాత్రమే గుర్తించి పాక్ ప్రేరేపిత ముష్కరమూకలు 26 మందిని పాయింట్ బ్లాంక్ రేంజ్ కాల్చి చంపారు.
అందులో కేవలం మగవారిని మాత్రమే వారి భార్యల ముందు కాల్చివేశారు. ఈ సంఘటనలతో దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ సంఘటలకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ తో పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు వందమంది ఉగ్రవాదులను హతం చేసింది.
ఈ ఆపరేషన్ తరువాత పాక్, భారత్ పైకి డ్రోన్లతో దాడి చేయడానికి విఫలయత్నం చేసింది. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మన దేశ సరిహద్దులోకి రాకముందే సైన్యం పేల్చివేసింది.
భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని 11 కీలక ఎయిర్ బేస్ లను , వారి యుద్ద విమానాలను కూల్చివేసింది. ఇస్లామాబాద్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మొత్తం నాశనం చేసింది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ముందు దాని ఎత్తులు పారలేదు. చివరకు ఆదేశ డీజీఎంఓ భారత్ ను కాల్పుల విరమణ కోరడంతో ఇరు దేశాలు అంగీకరించాయి.