ఆక్సిస్ మై ఇండియాలోనే ఎన్డీఏకే పట్టం

సీఎంగా తేజస్వీ యాదవ్ ఉండాలంటున్న 41 శాతం మంది ప్రజలు

Update: 2025-11-13 07:04 GMT
ఎగ్జిట్ పోల్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిదే విజయం అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, తాజాగా విడుదలైన మరో రెండు ఎగ్జిట్ పోల్స్ లోనూ కమలదళం నేతృత్వంలోని కూటమిదే బీహార్ అని తేల్చేశాయి.

అయితే బీహార్ లో మాత్రం అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరిస్తుందని అంచనా వేశాయి. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టికి ఆక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య రెండు ఎటువంటి ప్రాధాన్యత లేదని తేల్చేశాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు రెండు నవంబర్ 14న విడుదల కానున్నాయి.

ఆక్సిస్ మై ఇండియా ఏం చెప్పిందంటే..
నవంబర్ 12న ఆక్సిస్ మై ఇండియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో మహాఘట్ బంధన్ కంటే ఎన్డీఏ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 2020 లాగానే ఈ ఎన్నికల్లోనే ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసింది.
సంస్థ అంచనా ప్రకారం ఎన్డీఏ 121 నుంచి 141 వరకు స్థానాలు గెలుచుకుంటుందని, మహఘట్ బంధన్ 98 నుంచి 118 స్థానాలు సాధిస్తుందని వెల్లడించింది. జన్ సురాజ్ రెండు స్థానాలలో విజయం సాధిస్తుందని తెలిపింది.
సంస్థ అంచనా ప్రకారం.. ఆర్జేడీ 67 నుంచి 76 స్థానాలు సాధిస్తుందని తెలిపింది. జేడీ(యూ) 56-62 స్థానాలు, బీజేపీ 50- 56, కాంగ్రెస్ 17- 21 స్థానాలు, వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ 3-5 స్థానాలు, లెఫ్ట్ పార్టీలు 10-14 స్థానాలు సాధిస్తాయని అంచనా వేసింది.
ఎగ్జిట్ పోల్ ప్రకారం.. ఎన్డీఏ 43 శాతం ఓట్ షేర్ సాధిస్తుందని, మహాఘట్ బంధన్ 41 శాతం గెలుచుకుంటుందని తెలిపింది. జన్ సురాజ్ 4 శాతం వస్తాయని అంచనా వేసింది.
34 శాతం మంది ప్రజలు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని కూడా తెలిపింది. నితిశ్ కుమార్ సీఎంగా ఉండాలని 22 శాతం ప్రజలు కోరుకుంటున్నారు.
ఓటర్ల వాటాలలో కూడా జెండర్ వారీగా పేర్కొంది. ఎన్డీఏ కు 41 శాతం పురుషులు, 45 శాతం మహిళలు ఓట్లు లభించవచ్చని, మహాఘట్ బంధన్ 42 శాతం పురుషులు, 40 శాతం మహిళా ఓటర్లు అండగా ఉన్నారని అంచనా వేసింది.
టుడేస్ చాణక్య అంచనాలు..
టుడేస్ చాణక్య అంచనా ప్రకారం.. బీజేపీ 160 సీట్లు (ప్లస్ ఆర్ మైనస్) ఆర్జేడీ దాని మిత్ర పక్షాలు 77 సీట్లు(ప్లస్ ఆర్ మైనస్) గెలుచుకుంటాయి. బీజేపీ దాని మిత్రపక్షాలు 44 శాతం ప్లస్ ఆర్ మైనస్ 3 శాతం ఓట్లు వాటా సాధిస్తుందని, ఆర్జేడీ మిత్ర పక్షాలు 38 శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది.
అంచనాలు..
బీహార్ లో మహా ఘట్ బంధన్ పై భారీ విజయంతో ఎన్డీఏ తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తరువాత అంచనాలు వెలువడ్డాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదని అంచనా వేశాయి.
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏ 147-167 సీట్లు, మహాఘట్ బంధన్ 70-90, జన్ సురాజ్ 0-2, వస్తాయని అంచనా వేయగా, దైనిక్ భాస్కర్ ఎన్డీఏ 145-160, మహా ఘట్ బంధన్ 73-91 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్ సైట్ ఎన్డీఏ కి 133- 148, మహాఘట్ బంధన్ 87-102, జన్ సురాజ్ 0-2 వస్తాయి.
పీపుల్స్ పల్స్ ఎన్డీఏ 133- 159, మహాఘట్ బంధన్ 75-101, సురాజ్ 0-5 సీట్లు ఇచ్చింది. జేవీసీ ప్రకారం.. ఎన్డీఏ 135-150, మహా ఘట్ బంధన్ 88-103, పోల్ స్ట్రాట్ 133-148, మహాఘట్ బంధన్ 87-102 గా అంచనా వేసింది. చాణక్య వ్యూహాం ఎన్డీఏ 130-138, మహాఘట్ బంధన్ 100-108 వస్తాయని తెలిపింది.
రికార్డ్ స్ఠాయిలో పోలింగ్..
బీహార్ ఎన్నికలు నవంబర్ 6-11 తేదీలలో రెండు దశలలో నిర్వహించారు. ఫలితాలు 14న ప్రకటిస్తారు. 243 మంది సభ్యులున్నా అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122, బీహార్ 67.14 శాతం పోలింగ్ నమోదైంది.


Tags:    

Similar News