కేజ్రీవాల్ కు దక్కని ఉపశమనం.. ఆ రోజుకి తీర్పు వాయిదా

అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు వాయిదా వేసింది.

Update: 2024-06-01 11:04 GMT

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. జూన్ 5 న తీర్పు వెల్లడిస్తానని న్యాయమూర్తి ప్రకటించారు.

ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా, అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ న పరిశీలించారు. వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారని, సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం కాదని గమనించి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. అయితే కేజ్రీవాల్ మాత్రం తనకు తక్షణమే ఉపశమనం లభిస్తుందని భావించిన న్యాయమూర్తి మాత్రం తీర్పును వాయిదా వేశారు.
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర ఉపశమనం జూన్ 1తో ముగుస్తుంది ఆదివారం నాటికి అతను లొంగిపోవాల్సి ఉంటుంది. రేపు మధ్యాహ్నం కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోనున్నారని ఇంతకుముందే వీడియో విడుదల చేసి ప్రకటించారు.
ఇప్పటికే మద్య కుంభకోణం కేసులో ఆప్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. అంతే కాకుండా ఆప్ పార్టీపై కూడా దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయి. ఇవే కాకుండా ఖలిస్తాన్ ఉగ్రవాదుల నుంచి ఏకంగా రూ. 126 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు సైతం రావడంతో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ దీనిపై విచారణ చేయాల్సిందిగా నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజన్సీకి ఓ లేఖ సైతం రాశారు. ఇలా ఆప్ ప్రస్తుతం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.
Tags:    

Similar News