కేజ్రీవాల్ ను విచారించనున్నజాతీయ దర్యాప్తు సంస్థ.. కేసేంటంటే..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడకు ఇప్పుడు టెర్రర్ ఫండ్ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ నుంచి 16 మిలియన్ డాలర్లు..

Update: 2024-05-07 08:10 GMT

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పడిప్పుడే తీహర్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ఆయనపై తాజాగా దేశ ద్రోహం కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. నిషేధిత ఉగ్ర సంస్థ, సిఖ్ ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు అందుకున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను విచారణ చేయాల్సిందిగా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఆదేశించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

దేవిందర్ పాల్ సింగ్ భుల్లర్‌ను విడుదల చేయడం కోసం తీవ్రవాద ఖలిస్తానీ గ్రూపుల నుంచి కేజ్రీవాల్ నేతృత్వంలోని AAPకి $16 మిలియన్ల నిధులు ఇచ్చామని సిఖ్ ఫర్ జస్టిస్ నాయకులు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. దీనిపై ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ సక్సేనాకు ఫిర్యాదు అందిందని LG సెక్రటేరియట్ కేంద్ర హోం కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొంది.
1993లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 9 మందిని హతమార్చిన కేసులో అమృత్‌సర్ సెంట్రల్ జైలులో ఉన్న భుల్లార్ దోషిగా తేలాడు. ఆగస్టు 25, 2001న టాడా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.అయతే సుప్రీంకోర్టు మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. అయితే ఆప్ పార్టీ వీటిని ఖండించింది. బీజేపీ ఆదేశాలతోనే మరో కుట్రకు ఎల్జీ తెరలేపారని విమర్శించింది.
ఎలక్ట్రానిక్ సాక్ష్యం..
ఫిర్యాదుదారుడు తమకు అందజేసిన పలు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను సైతం ఫోరెన్సిక్ పరీక్ష జరపించాలని కేంద్ర హోంశాఖ కు ఎల్జీ రాసిన లేఖలో కోరారు. ఒక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారని, నిషేధిత ఉగ్రవాద సంస్థ నుంచి రాజకీయ నిధులకు సంబంధించి అందులో పేర్కొన్నారని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేజ్ర్‌వాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోవడానికి ఒకరోజు ముందు ఆయనపై ఈ కేసును విచారించాల్సిందిగా ఎల్జీ, కేంద్ర ప్రభుత్వనాన్ని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆప్ చీఫ్‌ని మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎక్సైజ్ పాలసీ లింక్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి అరెస్టు చేసింది.
2014 - 2022 మధ్యకాలంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP ఖలిస్తానీ గ్రూపుల నుంచి $16 మిలియన్ల విరాళాలు ఇచ్చినట్లు ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదీ, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత అయినా గురుపత్వంత్ సింగ్ పన్నూ ఆ మధ్య మీడియాలో చెప్పారు. ఈ వీడియోనే ఫిర్యాదు కింద ఎల్జీకి అందజేసినట్లు తెలుస్తొంది.
ఇది కమల దళం తాజా కుట్ర: ఆప్
ఎల్‌జీకి చేసిన ఫిర్యాదులో, కేజ్రీవాల్ 2014 లో అమెరికాలో చేసిన తన పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్స్‌ గురుద్వారాలో ఖలిస్తానీ నేతలతో క్లోజ్డ్ డోర్ సమావేశాలు నిర్వహించారని కూడా ఆరోపించింది. ఇందులో తనకు ఆర్థిక సాయం అందిస్తే.. బాంబు దాడులకు పాల్పడి, తొమ్మిది మందిని చంపిన ఉగ్రవాదీ భుల్లర్ ను విడుదల చేయిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనికి సంబంధించి అప్పట్లో సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లలో, మాజీ ఆప్ కార్యకర్త మునీష్ కుమార్ రైజాదా కూడా ఖలిస్తానీ నాయకులతో కేజ్రీవాల్ సమావేశానికి సంబంధించిన ఫొటోలు బయటపెట్టారని ఫిర్యాదులో తెలిపారు.
ఈ పరిణామంపై ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ స్పందిస్తూ, “బీజేపీ సూచన మేరకు కేజ్రీవాల్‌పై మరో కుట్ర” అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతో ఇలా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉగ్రవాదీ భుల్లర్ అమృత్ సర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జూన్ 2015న అనారోగ్య కారణాలతో అతడికి అక్కడికి తరలించారు.
Tags:    

Similar News