యూపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు: అఖిలేష్ యాదవ్
2022 లో అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు;
By : Praveen Chepyala
Update: 2025-08-18 11:43 GMT
శిల్పి సేన్
ఉత్తరప్రదేశ్ లో ఓటర్ల తొలగింపు సహ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే వివాదం మళ్లీ రాజుకుంది. 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత ఓటర్ల జాబితాలో విస్తృతమైన అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సోమవారం పార్లమెంట్ లో పార్టీ సమర్పించిన అఫిడవిట్ కాపీలను పంపిణీ చేశారు. ఈసీ నుంచి వచ్చిన రసీదులతో సహ పలు కాపీలను ఆయన కొంతమంది జర్నలిస్టులకు అందించారు.
ఫిర్యాదులు చేయడానికి ఉన్న సమయ పరిమితి దృష్టిలో పెట్టుకుని అఫిడవిట్లను తొందరంగా సంకలనం చేశారని ఈసీ, రాజకీయ పార్టీకి మెషిన్ రీడబుల్ రోల్స్ ను అందించి ఉంటే ఓటర్ల జాబితాలో రిగ్గింగ్ జరిగిన సీట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదని అఖిలేష్ ఆరోపణలు చేశారు.
తిరిగి ఫిర్యాదులు..
ఇటీవల పరిణామంలో ప్రతిపక్షాల ‘ఓటు చోరి’ ప్రచారం ఊపందుకుంది. పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ మరోసారి ఈసీకి ఫిర్యాదు చేసింది.
యూపీలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలతో పాటు ఫిర్యాదును ఈ మెయిల్ ద్వారా ఈసీకి తిరిగి సమర్పించినట్లు ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చంద్ తెలిపారు.
2022 లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ, ఈసీకి ఇచ్చిన జాబితానే ఇవి. ఆ సమయంలో ఫిర్యాదుతో పాటు అఫిడవిట్లను సమర్పించినట్లు పార్టీ తెలిపింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెద్ద సంఖ్యలో ముస్లింలు, వెనకబడిన కులాలు, దళిత ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఎస్పీకి ఈసీ ఫిర్యాదు చేసింది. ఈ తరువాత కొద్దిసేపటికే ప్రధాన ఎన్నికల అధికారి ఎస్పీకి నోటీస్ జారీ చేసి, ఫిర్యాదులను అఫిడవిట్లతో సమర్పించాలని ఆదేశించారు.
సమస్య మళ్లీ తెరపైకి..
ఈసీ ఆదేశాల మేరకు సమాజ్ వాదీ పార్టీ మరోసారి ఫిర్యాదులు దాఖలు చేసింది. ఈసారి పెద్ద సంఖ్యలో అఫిడవిట్లు, సహయక పత్రాలను అందించింది. ఎస్పీ చీఫ్ ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ఆధారిత ఫిర్యాదుకు సంబంధించిన రసీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈసీకి ఫిర్యాదు చేసిన తరువాత తిరిగి వాటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని చెప్పారు. ఆ ఫిర్యాదును అంగీకరిస్తూ ఈసీకి చేసిన మెయిల్ ను పంచుకున్నారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున తెరపైకి రావడంతో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్ల తొలగింపు పై ఆందోళనలు యూపీలో ప్రారంభం అయ్యాయి.
ఓటర్ల అక్రమాలు...
రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపణల నేపథ్యంలో ఓటర్ల అక్రమాలను తిరిగి ఈసీకి సమర్పించడంలో ఎస్పీ అనేక యూపీ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులను హైలైట్ చేసింది. ఎస్పీ అందజేసిన అఫిడవిట్ లను ఈ జాబితాలను ఫెడరల్ సంపాదించింది.
రాయ్ బరేలీ, కుంట(ప్రతాప్ గఢ్), బాబాగంజ్(ప్రతాప్ గఢ్), పాటియాలీ(కాస్ గంజ్), మరియాహు(జాన్ పూర్), బల్లియా నగర్(బల్లియా), కర్నల్ గంజ్(గోండా), అమ్రోహ వంటి నియోజక వర్గాల్లో అక్రమాలు జరిగాయని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. ఈ నియోజకవర్గాలను సంబంధించి తొలగించబడిన ఓటర్ల పేర్ల పూర్తి జాబితాలు సమర్పించారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫిర్యాదు అందిన తరువాత ఎస్పీ స్వయంగా దర్యాప్తు నిర్వహించింది. వాస్తవాలు ధృవీకరించబడిన తరువాత మేము ఎన్నికల సంఘానికి అఫిడవిట్ లతో ఫిర్యాదులను సమర్పించాము. ఇప్పుడు మేము మళ్లీ అలాగే చేశాము. మేము లోక్ సభ ఓటర్ జాబితాను కూడా పరిశీలిస్తున్నాము’’ ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చంద్ అన్నారు.
మెయిర్ పురీ లో ఈ విషయాన్ని లేవనెత్తిన ఎంపీ డింపుల్ యాదవ్.. పెద్ద సంఖ్యలో ముస్లింలు, వెనకబడిన వర్గాల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని అన్నారు.
బీజేపీ నాయకులు..
బీజేపీ నాయకుడు కన్నౌజ్ ఎమ్మెల్యే, యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రి అయిన అసీమ్ అరుణ్ కూడా బీజేపీ మద్దతుదారుల పేర్లను కన్నౌజ్ ఓటర్ల జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. రాబోయో రోజుల్లో ఓటర్ల జాబితా అవకతవకల సమస్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.