పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఈ నివేదికలు ఎందుకు వస్తున్నాయి: బీజేపీ

దేశ ఆర్థిక పరిస్థితి గందరగోళంలోని నెట్టేసేందుకు విదేశీ సంస్థలతో కలిసి కాంగ్రెస్ కుట్రపన్నుతోందని బీజేపీ ఆరోపించింది. అందులో భాగంగానే కేవలం పార్లమెంట్ సమావేశాలు

Update: 2024-08-11 12:55 GMT

భారత్ ను ఆర్థిక అస్థిరత, గందరగోళం సృష్టించేందుకు విదేశీ కుట్రలు జరుగుతున్నాయని, వాటిలో కాంగ్రెస్ సహ ఇతర విపక్షాలు కుట్రలో భాగమయ్యాయని బీజేపీ ఆరోపించింది. దేశ ఆర్థిక పర్యవేక్షణ సంస్థను అప్రతిష్టపాలు చేసేందుకు సెబీ చైర్ పర్సన్ పై హిండెన్ బర్గ్ ఇలాంటి నివేదికలు విడుదల చేసిందని కమలదళం విమర్శించింది.

అదానీ గ్రూప్‌పై గతేడాది తీవ్ర ఆరోపణలు చేసిన షార్ట్ సెల్లింగ్ సంస్థ భారత దర్యాప్తు సంస్థల పరిశీలనను ఎదుర్కొంటోందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ఎలాంటి క్రెడిబిలిటీ లేని సంస్థల ఆరోపణను పదేపదే వల్లే వేస్తున్నాయని బీజేపీ ఘూటైన విమర్శలు చేసింది. ఆర్థిక రంగంలో గందరగోళం, అస్థిరతను సృష్టించాలనుకుంటున్న కుట్ర ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పిటిఐకి చెప్పారు.
విదేశీ గడ్డ నుంచి వెలువడే అనేక విమర్శనాత్మక నివేదికలు పార్లమెంటు సమావేశాల ముందు లేదా సమయంలో విడుదల చేయబడతాయని పేర్కొన్న ఆయన, పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు నివేదిక వస్తోందని ప్రతిపక్ష నాయకులకు తెలుసని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంతో ముగియాల్సి ఉండగా ఒక్క పనిదినం తగ్గించి శుక్రవారం ముగించారు.
ఈ కుట్రలో భాగం ఉంది..
ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ తో కాంగ్రెస్ కు బలమైన సంబంధాలు ఉన్నాయని, అందుకే సెబీ పై దాడులకు దిగుతోందని అన్నారు. దేశ మార్కెట్ ను పూర్తి స్థాయిలో గందరగోళంలోకి నెట్టివేయడానికి కాంగ్రెస్ లక్ష్యంగా ఉందని బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
ఇది ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకదానిని అస్థిరపరచడం, అప్రతిష్టపాలు చేయడం, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టించడం, వీరి లక్ష్యం అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
మార్కెట్ రెగ్యులేటర్‌ను అప్రతిష్టపాలు చేయడం, బుల్లిష్ సెంటిమెంట్‌లను నెమ్మదింపజేయడానికి పెట్టుబడిదారులకు మార్కెట్‌లలో గందరగోళం, నష్టాలను కలిగించే లక్ష్యంతో కూడిన క్లాసిక్ "కాంగ్రెస్ స్టైల్ ఇన్‌వెండో, అబద్ధాలు ఒకదానికొకటి అతుక్కొని ఉన్నాయి " అని పేర్కొన్న నివేదికను తాను చదివానని ఆయన చెప్పారు.
"నేను తరచూ చెబుతున్నాను. మళ్లీ చెబుతున్నాను, కాంగ్రెస్ రాజవంశం సహాయంతో అనేక ప్రపంచ శక్తులు భారతదేశ ఎదుగుదలను మందగించేలా చేయాలని లేదా ముందడుగు వేయకుండా చూడాలని కోరుకుంటున్నాయి. మేము వారిని అనుమతించము" అని ఆయన చెప్పారు.
హిండెన్‌బర్గ్ ఆరోపణలు
సెబీ చైర్ పర్సన్ మధాబీ బుచ్ భర్తకు, అదానీ గ్రూపు కు చెందిన ఆఫ్ షోర్ బిజినెస్ లో పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించింది. ఈ విలువ దాదాపు రూ. 83 కోట్ల వరకూ ఉన్నాయని పేర్కొంది. అయితే వీటిని అదానీ గ్రూపు ఖండించింది. సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కూడా వీటిని ఖండించారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఈ షార్ట్ సెల్లింగ్ విషయంలో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.


Tags:    

Similar News