ఇక నుంచి విదేశీయులు సైతం అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు

కుంభమేళాకు భారీగా విదేశీ భక్తులు రావడంతో ఈ నిర్ణయం;

Update: 2025-01-21 05:25 GMT

గత ఏడాది అయోధ్య లో ప్రారంభమైన రామమందిరంలోకి విదేశీయులను అనుమతించాలని ఆలయ అధికారులు తెలిపారు. ఇతర దేశాల నుంచి అయోధ్య కు వచ్చిన భక్తులు తమ పాస్ పోర్ట్ లను సమర్పించి వీఐపీ ప్రవేశాన్ని పొందవచ్చని ఆలయ ట్రస్ట్ పేర్కొంది.

రామాలయ ట్రస్ట్ సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. అలాగే ప్రయాగ్ రాజ్ లోని మహ కుంభ మేళాను సందర్శించే విదేశీయులు, ఎన్ఆర్ఐలు రామమందిరాన్ని సందర్శించడానికి అయోధ్యకు వస్తున్నారు. దీనితో వారి సౌకర్యార్థం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
అయోధ్య ప్రాంతీయ పర్యాటక అధికారి ఆర్ పీ యాదవ్ మాట్లాడుతూ.. విదేశీ భక్తులు తమ పాస్ పోర్టు ను యాత్రికుల సేవా కేంద్రంలో చూపించి రామాలయంలోకి ప్రవేశించాడానికి వీఐపీ పాస్ లు పొందవచ్చని తెలిపారు. గడచిన 20 రోజుల్లో కనీసం 100 మందికి పైగా విదేశీయులు రామ్ లల్లాను దర్శించుకున్నారని ఆయన తెలిపారు.
దేవాలయానికి వీఐపీ సందర్శనల కోసం పాస్ లు లేదా సీనియర్ పోలీస్ అధికారుల సిఫార్స్ ఆధారంగా జారీ చేస్తున్నామని తెలిపారు. విదేశీ పౌరులు , ఎన్ఐఆర్ లు తమ పాస్ పోర్ట్ లను ఉపయోగించి వీఐపీ పాస్ లను తీసుకోవచ్చని ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు.
ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తున్న మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తున్నారు. అక్కడి వచ్చిన భక్తులు కాశీ, గయ తో పాటు అయోధ్య రామలయానిని వస్తున్నారు. కుంభ మేళాకు భారీగా విదేశీ భక్తులు వస్తుండటంతో ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుంభమేళాకు ఇప్పటి వరకూ 11 కోట్ల మంది భక్తులు వచ్చి పవిత్ర స్నానం చేశారు.
Tags:    

Similar News