‘‘శాంతాక్లాజ్ డ్రెస్సులు వేసుకోమని చెప్పొద్దు’’
రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు, బలవంతం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
By : Praveen Chepyala
Update: 2025-12-24 05:34 GMT
క్రిస్టమస్ సందర్భంగా ప్రయివేట్ పాఠశాలలో ‘శాంతాక్లాజ్’ తరహ డ్రెస్సులను వేసుకోమని విద్యార్థులను బలవంతం చేయకూడదని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా విద్యాశాఖ ఈ మేరకు ప్రయివేట్ పాఠశాలలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు జోరుగసాగుతున్నాయి.
దీనితో విద్యాశాఖ కూడా అప్రమత్తమై ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఏదైన ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి డిసెంబర్ 22న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నాడు.
పాఠశాలలు క్రిస్టమస్ కార్యక్రమాలలో పాల్గొనమని విద్యార్థులను కానీ, తల్లిదండ్రులను బలవంతం చేయకూడదని ఆయన ఆదేశించారు. ‘‘ఈ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను బలవంతం చేస్తే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఉత్తర్వ్వులో వాద్వా పేర్కొన్నారు.
తల్లిదండ్రులు, పిల్లల సమ్మతితో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే విద్యార్థులను, తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చినా, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై వహించాల్సి ఉంటుందని అన్నారు.
వీర్ బాల్ దివస్..
సాహిబ్ జాదాల అత్యున్నత త్యాగాన్ని స్మరించుకునేందుకు డిసెంబర్ 25ని వీర్ బల్ దివస్ గా పాటిస్తున్నామని, పాఠశాలలు తమ కార్యక్రమాలలో ఎటువంటి బలవంతం లేకుండా సున్నితత్వం, సమతుల్యత కాపాడుకోవాలని ఆయన అన్నారు.
ఇటీవల సంవత్సరాలలో కొన్ని పాఠశాలలు పిల్లలను శాంతాక్లాజ్ లాగా దుస్తులు ధరించమని బలవంతం చేస్తున్నాయని, దీనివలన తల్లిదండ్రులలో ఆగ్రహం వ్యక్తమవుతోందని ఆరోపిస్తూ భారత్-టిబెట్ సహయోగ్ మంచ్ జిల్లా విద్యా అధికారులకు చేసిన ప్రాతినిధ్యాన్ని ఆ ఉత్తర్వులో ప్రస్తావించారు. శ్రీ గంగానగర్ ప్రధానంగా హిందూ- సిక్కులు మెజారిటీ ప్రాంతం అని ఎటువంటి ప్రత్యేక సంప్రదాయాన్ని విధించరాదని ఆ సంస్థ పేర్కొంది.