రాహుల్ పై సొంతపార్టీకే నమ్మకం లేదు: బీజేపీ

ప్రియాంకను ప్రధానిగా చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన కమలదళం

Update: 2025-12-23 11:53 GMT
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా

ప్రియాంక గాంధీ వాద్రాను వంశపారంపర్యంగా ఆమె నానమ్మ అయిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పోలీకలు తీసుకురావడంపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది.

ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలన్నా కాంగ్రెస్ ఎంపీ ప్రతిపాదనపై ఆ పార్టీ వ్యాఖ్యానిస్తూ.. రాహుల్ గాంధీ నాయకత్వంపై కాంగ్రెస్ నాయకులకు కూడా నమ్మకం లేదని విమర్శలు గుప్పించింది.

కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకను ప్రధానమంత్రిని చేస్తే, పాకిస్తాన్ కు ఇంకా నయం కానీ భారీ నష్టాన్ని కలిగించిన తన నానమ్మ ఇందిరాగాంధీ లాగా ఆమె ప్రతీకారం తీర్చుకుంటుందని మసూద్ అన్నారు.

‘‘ప్రియాంక గాంధీ ప్రధానమంత్రినా? ఆమెను ప్రధానమంత్రిని చేయండి. ఇందిరాగాంధీ లాగా ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో చూడండి. ఆమె ప్రియాంక గాంధీ. ఆమె పేరు వెనక గాంధీ అని చేర్చుకున్నారు’’ అని మసూద్ అన్నారు.
‘‘ఆమె ఇందిరాగాంధీ మనవరాలు, పాకిస్తాన్ కు చాలా నష్టం కలిగించిన ఆమె చేసిన గాయాలు ఇంకా మానలేదు. ఆమెను ప్రధానమంత్రిని చేశాక ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో చూడండి. మీరు అలా చేయడానికి ధైర్యం చేయరు’’ అని ఆయన చెప్పారు.
హిందూ వ్యక్తి మరణంపై ప్రియాంక స్పందన..
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న వేధింపుల అంశాన్ని పొరుగుదేశ ప్రభుత్వంతో గట్టిగా చర్చించాలని ప్రియాంక గాంధీ ‘ఎక్స్’ లో కేంద్రాన్ని కోరారు. ఇస్లాంను అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బంగ్లాదేశ్ లోని ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన తరువాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బంగ్లాదేశ్ లోని హిందూ యువకుడైన దీపు చంద్రదాస్ ను ఒక గుంపు దారుణంగా హత్య చేసిన వార్త చాలా ఆందోళనకరంగా ఉంది. ఏ నాగరిక సమాజంలోనైనా, మతం, కులం గుర్తింపు మొదలైన వాటి ఆధారంగా వివక్ష, హింస, హత్యలు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు’’ అని ప్రియాంక ఎక్స్ లో పోస్ట్ పేర్కొన్నారు.
‘‘పక్కదేశంలో హిందూ, క్రైస్తవ, బౌద్ద మైనారిటీలపై పెరుగుతున్న హింసను భారత ప్రభుత్వం గుర్తించి, వారి భద్రత అంశాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందు గట్టిగా లేవనెత్తాలి’’ అని ఆమె అన్నారు.
కాంగ్రెస్ లోనే రాహుల్ కు మద్దతు లేదు: బీజేపీ
మసూద్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి షాజాడ్ పూనావాలా ప్రస్తావిస్తూ... రాహుల్ నాయకత్వంపై తనకు నమ్మకం లేదని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ రాహుల్ గాంధీపై తనకు ఇకపై నమ్మకం లేదని స్పష్టంగా చెప్పారు. రాహుల్ హటావో, ప్రియాంక గాంధీ లావో..రాహుల్ గాంధీపై ఎవరికి నమ్మకం లేదని స్పష్టంగా చెప్పలేము’’ అని ఆయన అన్నారు.
ప్రియాంక గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ ఇప్పుడు ఒత్తిడి చేస్తోంది. ఈ చర్యకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా మద్దతు ఇస్తున్నారని పూనావాల్ల ప్రశ్నించారు. రాహుల్ ప్రజా మద్దతును కోల్పోవడమే కాకుండా కాంగ్రెస్ లోపల కూడా మద్దతును కోల్పోయారని ఈ వ్యాఖ్యలు రూఢీ చేస్తున్నారని అన్నారు.


Tags:    

Similar News