సరిహద్దు నష్ట జాతకుల వ్యథలు తెలుసా?

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగినప్పుడల్లా సమిధలు అవుతున్న సరిహద్దు ప్రజలు;

Byline :  44
Update: 2025-05-20 07:47 GMT
ఖాళీ అయిన దుకాణంలో నిరాశ కూర్చున్న దుకాణదారుడు

గత కొన్ని దశాబ్ధాలుగా పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న గ్రామాలు, పట్టణాలలో నివసిస్తున్న ప్రజల దుస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే కాశ్మీరీ పండిట్ల ఊచకోత కంటే అధమ స్థాయికి వారి జీవనం చేరింది.

1990 చివర్లో కాశ్మీర్ లోయలో పుట్టిన ఇస్లామిక్ జిహాదీ మతోన్మాదం అక్కడి హిందూ పండిట్లే లక్ష్యంగా హత్యలు, దోపిడీలు, స్త్రీల పట్ల అవమానీయ ప్రవర్తనకు పాల్పడ్డాయి. ఈ కారణంగా దేశంలో ఎలాంటి విధ్వంసం జరిగిన వాటిని కాశ్మీరీ హిందూ పండిట్ల ఊచకోతతో పోలుస్తుంటారు.

ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా అక్కడి పండిట్లు జమ్మూతో సహ దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిపోయారు. ఇలా ఎక్కడ ప్రజల వలసలు జరిగినా అక్కడి వారిని పండిట్లకు జరిగిన దారుణాలతోనే లెక్కగట్టే అలవాటు ప్రారంభం అయింది.
ఇప్పుడు అలాంటి విషాదమే దశాబ్ధాలుగా సరిహద్దులో నివసిస్తున్న ప్రజలకు జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఇదో నిత్యనరకంలా మారింది. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ సైన్యం ప్రజలే లక్ష్యంగా చేస్తున్న దాడులు.
నష్టాలు.. వలసలు.. పునర్మిర్మాణం..
మీకు ఈ విషయాన్ని ఓ ఉదాహారణతో చెపుతాను. 2014 లో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లోని ట్రేవా పట్టణం పై పాకిస్తాన్ రేంజర్లు మోర్టార్లతో దాడులు చేశారు. ఇక్కడ నివసిస్తున్న ఆశాదేవి అనే మహిళ తన సరిహద్దు గ్రామం నుంచి ఉన్నఫలంగా పారిపోవాల్సి వచ్చింది.
అప్పుడే ఆమె గర్భవతిగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరానికి చేరుకోవడానికి దాదాపు 30 కిలోమీటర్లు నడిచింది. కొన్ని రోజుల తరువాత పరిస్థితి సద్దుమణిగిందని తిరిగి ఇంటికి చేరింది. కొన్ని నెలల తరువాత ఆశా కవలలు(హర్ష్, క్రిష్) జన్మించారు. ఆమె తదుపరి దశాబ్ధం పాటు వారిని పెంచుతూ తన వద్ద ఉన్న పరిమిత ఆర్థిక వనరులతో తన ఇంటిని, జీవితాన్ని పునర్మించుకునే పనిలో గడిపింది.
మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరులను మతం అడిగి మరీ హతమార్చినందుకు ప్రతీకారంగా మే 6, 7 వ తేదీల మధ్య భారత్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసి వందమంది ఉగ్రవాదులను హతమార్చింది.
ఈ దాడి జరిగిన 24 గంటల్లోనే పాకిస్తాన్ దళాలు దేశ పశ్చిమసరిహద్దే లక్ష్యంగా దాడులు చేయడం ప్రారంభించాయి. ఇందులో దేశంలోని జమ్మూడివిజన్ లోని గ్రామాలు, పట్టణాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిలో ట్రేవా పట్టణం ఒకటి. మూడు రోజుల పాటు జరిగిన దాడులో చాలా పౌర ఆవాసాలు నివాసానికి పనికి రాకుండా పోయాయి.
దేశంలోని చాలా మంది తమ ఇంటికి దూరంగా ఉన్న ఈ సంఘర్షణకు మద్దతు ఇస్తూ, పాకిస్తాన్ ను నిర్మూలించాలని నినాదాలు చేస్తున్నారు. అయితే సరిహద్దులో నివసిస్తున్న ఆశా వంటి సామాన్యులకు ఇది అంతులేని విషాదం తెస్తుంది.
ఏదైన సాయుధ దాడి జరిగితే నష్టం, స్థానభ్రంశం, పునర్మిర్మాణం వంటి విషచక్రం ఇక్కడ ప్రజలకు ప్రారంభం అవుతుంది.
మే 8న పాకిస్తాన్ సరిహద్దులో కాల్పులకు దిగడంతో ఆశాకు మరోసారి 2014 వ సంవత్సరం ప్రారంభం అయింది. ఈ సారి తన కుమారులతో గత భయానక అనుభవాలు మరోసారి అనుభవించింది.
వారి ఇంటిని కోల్పోవడం, ఆకాశం నుంచి దూసుకువచ్చే మృత్యువును తప్పించుకోవడం, పునరావాసాలకు కవాతు చేయడం, ఇంటిలో కంటే అక్కడే ఎక్కువ కాలం గడపడం మరోసారి కళ్లముందు కనిపించాయి. సరిహద్దులో పరిస్థితి తిరిగి సాధారణమైన తరువాత ఇంటికి చేరుకోవడం.
ట్రేవా నుంచి కనీసం 30 కుటుంబాలు బిష్నా షెల్టర్ ఆశ్రయం పొందాయి. ఇతర సరిహద్దు పట్టణాలు, గ్రామాల నుంచి చాలా మంది జమ్మూ జిల్లాలోని ఇతర ప్రాంతాలలో, జమ్మూ పట్టణంలో స్థానిక యంత్రాంగం ఏర్పాటు చేసిన ఇలాంటి సహాయ కేంద్రాలకు వెళ్లారు.
స్వల్పకాలిక సంకోచాల..
పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న ఆశాదేవి వంటి అనేక కుటుంబాలకు మరణాలు, విధ్వంసం, స్థాన భ్రంశం వంటి కనికరం లేని జీవన విధానం సజీవ అనుభవం. శాంతి స్వల్పకాలిక దుస్సంకోచాలలో మాత్రమే వస్తుంది.
ఇక్కడ ఎల్లప్పుడూ హింస అనేది ఆకుచాటున ఉంటుంది. అది ఎంతకాలం స్తబ్ధుగా ఉంటుందో తెలియదు.. ఎప్పుడూ విజృంభిస్తుందో తెలియదు.
భారత ఆర్థిక రాజధాని ముంబై దాని సామర్థ్యానికి గుర్తుగా అనేకసార్లు ప్రశంసలు అందుకుంది. ఈ నగరంపై ఉగ్రవాదులు 26/11 దాడులకు తెగబడ్డారు. ఈ భయానక అనుభవం నుంచి ముంబైకర్లు తిరిగి సాధారణ జీవనానికి అలవాటు పడ్డారు. దానికి కారణం ముందుకు సాగాలనే స్ఫూర్తి.
బిష్నా మాదిరిగానే, అఖ్నూర్ సెక్టార్ పరిధిలోని దాని పరిసర ప్రాంతాల నుంచి పారిపోతున్న ప్రజలకు సాయం చేయడానికి గతవారం మిశ్రివాలాలో కూడా తాత్కాలిక పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
మిశ్రివాలాలో ఆశ్రయం కోరుతూ వచ్చిన వృద్దులకు, ఆశ్రయం ఇచ్చినప్పుడూ ఆశాకు ‘డెజావు’ గుర్తుకు వచ్చింది. కార్గిల్ యుద్ధం ఉధృతంగా జరుగుతున్న సందర్భంగా కూడా చాలామంది మిశ్రివాలకు తిరిగి వచ్చారు.
కార్గిల్ యుద్ధం ముగిసినప్పటికీ నుంచి రెండు తరాలు మారాయి. కానీ మిశ్రీవాలాలోని సహాయ శిబిరంలో గడినప్పుడూ తిరిగి వారికి అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ శిబిరం మొత్తం గంభీరమైన నిశ్శబ్ధం అలుముకుంది.
అఖ్నూర్ శిబిరంలో ఓ బాధితుడు విలేకరితో మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘‘ ఈ ప్రాంతాలలో ఒక తాత తన మనవడికి చెప్పే జీవిత కథ కాదా? తాత తన మనవడితో తిరిగి జీవించడం విచారకరమైన వాస్తవం’’ సరిహద్దు గ్రామాల ప్రజలు స్థానభ్రంశం చెందడాన్ని అదృష్టంగా, సులభమైన అంశంగా భావిస్తారనేది విడ్డూరంగా ఉంది. ఇవి కూడా లేకపోతే వారికి ఉన్న ఏకైక ప్రత్యమ్నాయం మరణం మాత్రమే.
సరిహద్దులో కాల్పులు అనేవి దశాబ్ధానికి ఒకసారి మాత్రమే జరుగుతాయని, అది చాలా స్పల్పంగా ఉండి ప్రభుత్వంతో పూరించబడుతుందని దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు భావించవచ్చు.
కానీ అది వాస్తవ విరుద్దం. పాకిస్తాన్ స్పందనకు భారత్ ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుందనేది భారత డీజీఎం రాజీవ్ ఘాయ్ పదేపదే చెప్పారు. ఇది చాలా తీవ్రమైనది, శిక్షాత్మకమైనది.
అయితే వాస్తవానికి చాలాసార్లు కాల్పుల విరమణ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ఢిల్లీలో కూర్చుకున్న రాజకీయ నాయకుల అంగీకరించే దానికంటే ఇక్కడ జరిగేవి ఎక్కువ.
విమానాశ్రయాల దగ్గర నివసించే ప్రజలు విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ల శబ్ధాలకు, రైల్వే స్టేషన్ ల దగ్గర నివసించే వారు రైళ్ల శబ్ధాలకు అలవాటు పడినట్లే, జమ్మూ సరిహద్దులో నివసించే ప్రజలు కూడా తరుచు ఫిరంగి కాల్పలు, పేలుడు శబ్ధాలను వింటూ పెరిగారు.
ఈ ఉల్లంఘనలు కూడా కాలనుగుణంగా మారుతుంటాయి. కాబట్టి తరుచుగా ఇంట్లో లేదా వ్యవసాయ క్షేత్రంలో ఓ రంధ్రంలో దాక్కోవడం సహజమే. కానీ ఎక్కువ కాలం ఇవి కొనసాగినప్పుడూ తప్పనిసరిగా స్థానభ్రంశం తప్పడం లేదు.
ఆశా దేవీ మొదటిసారిగా బిష్నా శిబిరానికి వెళ్లిన సమయం 2014 అప్పుడూ పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయి. ఆ ఒక్క ఏడే ఏకంగా 550 సార్లు కాల్పుల విరమణ జరిగింది.
వాటిలో ఎక్కువ భాగం ఆగష్టు- అక్టోబర్ కాలంలో చోటు చేసుకున్నాయి. భారత్ - పాకిస్తాన్ మధ్య 2003 లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తరువాత ఈ సంవత్సరమే ఎక్కువగా కాల్పులు చోటు చేసుకున్నాయి.
20 మంది సాధారణ ప్రజల మృతి..
ఈ సంవత్సరం కూడా అఖ్నూర్ సెక్టార్ లో పరిస్థితి శృతి మించడంతో మిశ్రీవాలా పునరావాస శిబిరానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. 2014 లో జమ్మూకాశ్మీర్ లోని జమ్మూడివిజన్ అంతటా సరిహద్దు పట్టణాలు, గ్రామాల నుంచి దాదాపుగా 32 వేల మందికి పైగా ప్రజలు పునరావాస శిబిరాలకు చేరుకున్నారు.
11 సంవత్సరాల క్రితం అత్యంత దారుణంగా దెబ్బతిన్న అఖ్నూర్ సెక్టార్ ను సందర్శించిన ఈ విలేకరికి ఓ విషయం గుర్తుకు వచ్చింది. ఒక సరిహద్దు గ్రామంలో ప్రజలు మిశ్రీవాల శిబిరంతో పాటు ఇతర సురక్షిత ప్రాంతాలకు పారిపోతుండగా 80 ఏళ్ల వయసున్న ఉన్న ఓ మహిళ తన ఇంటి ముందు నిరాశగా కూర్చుంది.
ఆ ఇంటి పైకప్పు పాక్ జరిపిన మోర్టార్ షెల్ ధాటికి ఎగిరిపోయింది. ఆమె కుమారుడితో సహ కుటుంబం మొత్తం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఒకటి రెండు రోజులకు సరిపడా ఆహారం మాత్రమే ఆమెకు ఉంది.
ఆశ్రయానికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలకు ఆమె తిరస్కరించారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి చూసిచూసి విసుగెత్తినట్లు, తన ఇంటిని వదిలివెళ్లే లక్ష్యం తనకు లేదని స్ఫష్టంగా ఈ విలేకరితో చెప్పారు.
గతవారం రెండు దేశాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జమ్మూకాశ్మీర్ లో దాదాపు 20 మంది మరణించారు. అందులో ఫూంచ్ జిల్లాలోనే 16 మంది ఉన్నారు. ఇళ్ల, వాణిజ్య సంస్థలు పంటలు, పశువులకు జరిగిన నష్టాన్ని ఇంకా లెక్కించలేదు. అయితే జీవితాలను పునర్మించడానికి అయ్యే ఖర్చను సాధారణంగా ఇక్కడ చూపరు.
1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం ముగిసిన తరువాత సరిహద్దు చొరబాటు, సాయుధ దాడులతో నాశనమైన సరిహద్దు ప్రాంతాలలో పర్యటన చేయాలని భారత సైన్యం నిర్ణయించిన పత్రికా బృందంలో ఆయన ఒక భాగం.
ఆ సమయంలో రైతులు జీరో లైన్ వరకూ పంటలు పండించుకుండా నిషేధం విధించారు. ఇది స్థానిక వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడింది. పెద్ద మొత్తంలో సాగుభూమి ఉన్నప్పటికీ రైతులు తమ పొలాలకు వైపుకు వెళ్లలేకపోయారు.
ఇది వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. అప్పటి రైతుల డిమాండ్ ఏంటంటే.. జీరో లైన్ వరకూ ఉన్న తమ భూములను సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల తమ పంట నష్టపోతే తగిన పరిహారం చెల్లించాలి.
రెండు సంవత్సరాల క్రితం కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 తరువాత జమ్మూకాశ్మీర్ లో శాంతి నెలకొందని, సాధారణ పరిస్థితులు వచ్చాయనే కథనాన్ని ప్రచారం చేయడానికి, సరిహద్దు ఘర్షణల కారణంగా పంట నష్టపోతే పూర్తి ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చింది.
జీరో లైన్ వరకూ వ్యవసాయం చేయడానికి అనుమతి మంజూరు చేసింది. అయితే మొన్నటి ఘర్షణలో సరిహద్దు ప్రాంతాలలో ఉన్నపంటచేలు విస్తారంగా నష్టపోయాయి. కానీ వారికి ఇచ్చిన హమీ మాత్రం ఇంకా తీరలేదు.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరపుకుంటూ భారత విజయంపై అనేక బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రధానమంత్రి, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ ప్రముఖులు పూంచ్, జమ్మూ ప్రాంతాలలోని పౌరుల మరణాలకు కనీసం సంతాపం కూడా తెల్పలేదు.
మే 16న ఆశాదేవీ తన ఇద్దరు కుమారులతో ట్రేవాకు తిరిగి వెళ్లి ఆమెకు అక్కడి విషాదాన్ని చూశాక మాటలు లేవు. ఈ విలేకరి అక్కడికి వెళ్లిన ఆశాదేవీని ఇలా ప్రశ్నించారు. ‘‘మీరు అక్కడకు వెళ్లిన తరువాత ఏం చేస్తారు?’’
దీనికి ఆమె సమాధానం.. తిరిగి ఇంటిని, జీవితాన్ని పునర్మించుకుంటానని చెప్పారు. తదుపరి వచ్చే స్థానభ్రంశం ఈసారి చాలా ఆలస్యం వస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే అలా జరగొద్దు అనే భావన మాత్రం ఆమె మనసులో కూడా మెదిలి ఉండదు. ఎందుకంటే అబద్దం అవుతుందని ఆశాదేవీకి సైతం తెలుసు.


Tags:    

Similar News