అర్వింద్ కేజ్రీవాల్ బదులుగా సునీతా కేజ్రీవాల్ వస్తారు: ఆప్

ఆప్ పార్టీ నాయకులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉండటంతో భార్య సునీత కేజ్రీవాల్ ఆయన వాయిస్ జనానికి వినిపిస్తారని ఆప్ నాయకత్వం ప్రకటించింది..

Update: 2024-04-19 08:30 GMT

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆప్ కు ఆయనే పెద్ద దిక్కు కావడంతో పార్టీ మొత్తం నైరాశ్యంలో కూరుకుపోయింది. దీని నుంచి పార్టీ కేడర్ ను బయటకు తీసుకురావడానికి సునీతా కేజ్రీవాల్ ను రంగంలోకి దింపాలని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. పార్టీ సభల్లో కేజ్రీవాల్ తరఫున ఇక నుంచి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ పాల్గొంటారు. ‘కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీకి దేశంలో ఎక్కడ అవసరమో అక్కడ అండగా ఉంటారు’ అని ఆప్ సిటీ యూనిట్ కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం తెలిపారు.

ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కేజ్రీవాల్ అరెస్టు తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ అభ్యర్థుల వెనుక ఢిల్లీ ప్రజలు అండగా ఉన్నారని రాయ్ అన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అన్ని రంగాలలో వెనుకబడిందని ఢిల్లీలోని ఏడు సీట్లు ఇండి కూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు.
ఆప్ స్టార్ క్యాంపెయినర్‌గా సునీతా కేజ్రీవాల్ గుజరాత్‌లో పర్యటించనున్నారు. గుజరాత్‌లోని భరూచ్, భావ్‌నగర్ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోంది. సునీతా కేజ్రీవాల్, తన భర్త లేనప్పుడు, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అవును అని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రచార ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
"అరవింద్ కేజ్రీవాల్ వాయిస్‌ని దేశమంతటా చేరకుండా జైలుకు పంపారు. సునీతా కేజ్రీవాల్ అతని వాయిస్‌ని ప్రతిచోటా వెళ్లి ప్రజలకు తెలియజేస్తారు" అని రాయ్ చెప్పారు. "దేశంలో కేజ్రీవాల్ వాయిస్‌ ఎక్కడ అవసరమో అక్కడికి సునీతా కేజ్రీవాల్ వస్తారు. " అని ఆప్ సీనియర్ నాయకుడు అన్నారు.
"ఒక పటిష్ట ప్రణాళిక ఉంది. అది సిద్ధమైన తర్వాత బహిరంగపరుస్తాము," అన్నారాయన. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి, వ్యూహానికి సంబంధించి పార్టీ, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సమిష్టిగా రోజువారీ నిర్ణయాలు తీసుకుంటున్నారని రాయ్ చెప్పారు. కేజ్రీవాల్ జైలుకి వెళ్లిన తరువాత పార్టీ బలహీనపడుతుందని బీజేపీ భావించిందని.. కానీ అలా జరగదని అన్నారు.
"అరెస్ట్ (కేజ్రీవాల్) తర్వాత AAP మరింత బలపడింది. ఇంతకుముందు చెల్లాచెదురుగా ఉన్నవారు ఇప్పుడు ఏకమయ్యారని నేను చెప్పగలను. దీని ఫలితం మే 25 న ఢిల్లీలో ఓట్ల తరువాత కనిపిస్తుంది." రాయ్ అన్నారు.
కేజ్రీవాల్ అరెస్ట్ ప్రభావం గురించి ఆప్ మొదట్లో జాగ్రత్తగా ఉందని, అయితే ప్రజలు పార్టీకి మద్దతు ఇచ్చారని, ఈ చర్యపై తమ ఆగ్రహాన్ని ప్రకటించారని ఆయన అన్నారు. "జైల్ కా జవాబ్ ఓటు సే" ప్రచారంలో భాగంగా పార్టీ పోటీ చేయనున్న ఢిల్లీలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఆరు లక్షల ఇళ్లకు 2,000 మంది వాలంటీర్ల బృందాలు చేరుకున్నాయని ఆయన చెప్పారు.
"ఢిల్లీ ఓటర్లు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తారు" అని రాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రారంభించిన aapkaramrajya.com వెబ్‌సైట్‌లో గత 10 ఏళ్లలో ఢిల్లీలో పార్టీ చేసిన కృషిని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజధానిలో మే 25న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
‘‘ఢిల్లీలోని ఏడు స్థానాల్లో బీజేపీ వెనుకంజలో ఉంది.. ఈ పదేళ్లలో ఏం చేశారని బీజేపీని ప్రశ్నించడంతో పాటు కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. దీనికి బీజేపీ వద్ద సమాధానం లేదు. ," రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు అనేది ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించబడుతుందా అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. "ఈ దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్లయితే, అప్పుడు మాత్రమే ఏదైనా ఆలోచించవచ్చు" అని రాయ్ అన్నారు.
AAP దేశ రాజధానిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది.. న్యూఢిల్లీలోని తూర్పు, దక్షిణ పశ్చిమ స్థానాల్లో ఆప్ బరిలోకి దిగింది. దాని కూటమి భాగస్వామి కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య, వాయువ్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగింది.


Tags:    

Similar News