రాజకీయ అరంగ్రేటం చేయబోతున్న సీఎం నితీశ్ కుమార్ ‘కుమారుడు’

తండ్రి ఇమేజ్ తగ్గుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయించే యోచనలో పార్టీ నాయకత్వం;

Update: 2025-02-24 11:48 GMT

ఈ సంవత్సరం చివరన బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో విశేషం ఉందంటారా? ప్రస్తుత ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగ్రేటం చేయడానికి సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.

ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న జేడీ(యూ) అధినేత నితిశ్ కుమార్ ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని ప్రకటించిన తరువాత ఈ పరిణామం జరిగింది.

అయితే వంశపారంపర్య రాజకీయాలను తీవ్రంగా విమర్శించే నితీశ్ కుమార్ తాజాగా తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావడంపై ఆశ్యర్యం వ్యక్తం అవుతోంది. ఇంతకుముందు ఆయన ఎల్జేపీ, ప్రధాన ప్రత్యర్థి అయిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) విమర్శలు గుప్పించేవారు. బిహార్ లో కుటుంబ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, తనకు మాత్రం బిహార్ కుటుంబం అని చాలాసార్లు గర్వంగా ప్రకటించారు.
రాజకీయాల్లో రావడానికి అన్ని ఏర్పాట్లు..
ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న 49 ఏళ్ల నిశాంత్ కుమార్, హోలీ పర్వదినం తరువాత రాజకీయాల్లోకి చేరాతారని తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల నుంచి నిరంతరం పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
నిశాంత్ కుమార్ రాజకీయాల్లో చేరడానికి సిద్దంగా ఉన్నారు. అయితే బీహార్ సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తలను ప్రచురించింది.
ఈ సంవత్సరం జనవరి 8న నిశాంత్ తన తండ్రితో కలిసి వారి స్వస్థలమైన భక్తియార్ పూర్ కు స్వాత్రంత్య్ర సమరయోధుల విగ్రహాలకు ఆవిష్కరించడానికి వెళ్లాడు. ఆ సందర్భంగా నిశాంత్ మాట్లాడుతూ.. తన తండ్రి వందశాతం ఫిట్ గా ఉన్నాడని, తిరిగి మరోసారి అధికార పీఠం అప్పగించాలని బహిరంగంగా పిలుపునిచ్చాడు.
‘‘వీలైతే మీరు నా తండ్రికి, అతని పార్టీకి ఓటు వేయండి. అతనికి మరోసారి ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి’’ అని చెప్పడం ఊహగానాలకు తావిచ్చింది. అయితే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలనే తన ఉద్దేశాలను ఆయన వెల్లడించలేదు.
ఆధ్యాత్మిక మార్గం..
ముఖ్యమంత్రి ఏకైక కుమారుడు నిశాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. లో ప్రోఫైల్ ను మెయిన్ టేన్ చేశాడు. సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆయన బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీఐటీ) మెస్రా విద్యార్థి. గత సంవత్సరం జూలైలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు.
2015 లో తన తండ్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనప్పుడూ సీనియర్ జేడీ(యూ) నాయకుడు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. చిన్న కుమార్ రాజకీయాల్లోకి రావచ్చని సూచనప్రాయంగా చెప్పాడు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బయట ప్రపంచానికి ఈ పేరు పెద్దగా వినిపించనప్పటికీ, జేడీయూ సర్కిల్ లో మాత్రం బాగానే వినిపిస్తుంది. గత ఏడాది జూన్ లో జేడీ(యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రామ్ కుమార్ మాట్లాడుతూ.. బిహార్ లోని పరిస్థితి.. సమయం నిశాంత్ కుమార్ రావడానికి సరిగ్గా ఉందని అన్నారు.
నితీశ్ కుమార్ ‘పరివార్ వాదం’ వ్యతిరేకిస్తున్నప్పటికీ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని అన్నారు.
స్వాగతం పలికిన తేజస్వీ
బీహార్ సీఎం కుమారుడు నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలపై ప్రతిపక్ష నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే తాను సంతోషిస్తానని అన్నారు. ఆయన రాక జేడీయూ ని బీజేపీ నుంచి రక్షిస్తుందని అన్నారు.
తాను నిశాంత్ ను సోదరుడిగా భావిస్తున్నాని అన్నారు. అతనికి శుభాకాంక్షలు తెలిపారు. దివంగత శరద్ యాదవ్ స్థాపించిన ఈ పార్టీకి ఇది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.
బీజేపీ అండగా నిలుస్తుంది..
రాబోయే ఎన్నికల్లో తన తండ్రికి ఓటు వేయమని నిశాంత్ ఓటర్లకు విజ్ఞప్తి చేయడం వలన ప్రజల్లో తన తండ్రిపై ఆదరణ తగ్గుతుందని ప్రతిపక్షాలు భావించాయి.
నితీశ్ కూడా తన కుమారుడిని రాజకీయాల్లోకి రావడానికి సరైన సమయంగా భావిస్తున్నారు. బీజేపీ కూడా ఈ ప్రతిపాదనను సమర్థించింది. నిశాంత్ ప్రశాంతమైన, దూరదృష్టి గల నాయకుడిగా మారుతారని, పార్టీకి రాష్ట్రానికి మంచి చేస్తారని బీజేపీ భావిస్తోందని రాష్ట్ర శాఖ నాయకులు అంటున్నారు.


Tags:    

Similar News