హిమాచల్ ప్రదేశ్: మూడు అసెంబ్లీ స్థానాల్లో ముందున్న కమలం

లోక్ సభ ఎన్నికలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అనర్హత కారణంగా ఖాళీ అయిన ఆరు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ జరుగుతోంది.

Update: 2024-06-04 06:33 GMT

హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్‌లో ముగ్గురు అభ్యర్థులు ముందస్తుగా అందుతున్న ట్రెండ్స్ ప్రకారం లీడ్ లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కూడా జరుగుతోంది.

ధర్మశాలలో బీజేపీ అభ్యర్థి సుధీర్ శర్మ 615 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, కుట్లేహర్‌ నుంచి పార్టీ అభ్యర్థి దేవిందర్ భుట్టో 397 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. లాహౌల్- స్పితి అసెంబ్లీ నియోజకవర్గంలో బర్సార్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ఇందర్ దత్ లఖన్‌పాల్ 1,031 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ మాజీ మంత్రి రామ్ లాల్ మార్కండ 1,354 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్‌పై విజయం సాధించిన బీజేపీ నేత రాజిందర్ రాణా సుజన్‌పూర్ నుంచి 1,351 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు, గాగ్రెట్ నుంచి బీజేపీ అభ్యర్థి చెతన్య శర్మ (బీజేపీ) 851 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
సుజన్‌పూర్, ధర్మశాల, లాహౌల్ & స్పితి, బర్సర్, గాగ్రెట్, కుట్లేహార్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. జూన్ 1న నాలుగు లోక్‌సభ స్థానాలతో పాటు ఈ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బడ్జెట్ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని విప్‌ను జారీ చేయగా, ధిక్కరించిన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటుదారులపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఆరు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
అంతకుముందు ఫిబ్రవరి 29న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఆరుగురు తిరుగుబాటు శాసనసభ్యులు బిజెపికి ఓటు వేశారు, తరువాత బిజెపిలో చేరారు. ఇప్పుడు వారి వారి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి బిజెపి టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు.
తిరుగుబాటు చేసిన వారిలో రాజిందర్ రాణా (సుజన్‌పూర్), సుధీర్ శర్మ (ధర్మశాల), రవి ఠాకూర్ (లాహౌల్ మరియు స్పితి), ఇందర్ దత్ లఖన్‌పాల్ (బార్సార్), చెతన్య శర్మ (గాగ్రెట్), దేవిందర్ కుమార్ భుట్టో (కుట్లేహర్) ఉన్నారు. వీరంతా బిజెపి రాజ్యసభ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. వీరితో పాటు మరో ముగ్గురు స్వతంత్య ఎమ్మెల్యేలు కూడా బీజేపీ అభ్యర్థికే ఓటు వేశారు. వీరు కూడా అనంతరం తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయగా స్పీకర్ తాజాగా ఆమోదించారు.


Tags:    

Similar News