బీహర్: కులం కంటే స్థానిక సమస్యలదే ప్రధాన పాత్ర
ప్రముఖ విద్యావేత్త మనీషా ప్రియమ్
Update: 2025-10-16 09:38 GMT
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రముఖ విద్యావేత్త, రాజకీయ శాస్త్రవేత్త, ఆర్థికవేత్త ‘ది ఫెడరల్’ నిర్వహించిన ‘ఆఫ్ ది బీటేన్ ట్రాక్’ తాజా ఎపిసోడ్ లో పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు.
బీహార్ ఓటర్ల ప్రాధాన్యతలు, కీలక రాజకీయ నాయకులు, ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) వంటి ఇటీవల పరిణామాలను వాటి అంతర్గత అర్ధాలను వివరించే ప్రయత్నం చేశారు.
ఈ ఎన్నికలు ఇంతకుముందు ఎన్నికలకు భిన్నంగా ఉంటాయా? లేదా ఎప్పటిలాగే కులం చుట్టూ తిరుగుతాయా?
దేశంలో ప్రజాస్వామ్యం చురుకుగా ఆలోచించే రాష్ట్రాలలో బీహర్ ఒకటి. చారిత్రాత్మకంగా బీహర్ మొదటి గణతంత్య్ర రాజ్యం నుంచి మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని ఉద్యమాల వరకూ ఓ కేంద్రంగా ఉంది. ఈ ఉద్యమాలు నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకుల రాజకీయ ఆలోచలను కేంద్రంగా నిలిచాయి.
రాష్ట్రంలో ఇప్పటికి కులం ముఖ్యమైనది. ముఖ్యంగా బీహార్ గ్రామీణ ప్రాంతం, గ్రామీణ జీవితం కులంతోనే కొనసాగుతోంది. నా గ్రామంలో కూడా నేను కుటుంబం ఆధారంగానే గుర్తించబడతాను.
కానీ ఓటింగ్ విషయంలో మాత్రం ప్రజలు కులం కంటే తమ సమస్యలకే ప్రాధాన్యం ఇస్తారు. 2020 బీహర్ ఎన్నికలు దీనికి ఉదాహారణ. ఇక్కడ కులం ఆధారిత నుంచి సమస్యల ఆధారిత దిశగా ఎన్నికలు సాగాయి.
ఎన్నికల సంఘం నిర్వహించిన ‘సర్’ ఎన్నికల చర్చను ప్రభావితం చేసిందా? ఎలా?
‘సర్’ కు ముందే ఎన్నికల రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. కోవిడ్ విభృంబన కార్మికుల జీవితాలను బయట పెట్టింది. చాలా దూరం నుంచి ప్రజలు కాలినడకన, సైకిళ్ల మీద ఇళ్లకు వచ్చారు.
చాలామంది ప్రజలు ఇప్పటికీ భూమిలేకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఇరుకు పట్టణ జీవితాలలో పోరాడుతున్నారు. వారి పిల్లలు యుక్త వయస్సుకు వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.
ఇది ఆందోళనకు కేంద్రంగా మారింది. ఎన్నికల సంఘం నిర్వహించిన సర్ అనేది తప్పుకాదు. కచ్చితమైన ఓటర్ల జాబితా అవసరం. కానీ ఎంచుకున్న సమయం సమస్యాత్మకంగా మారింది. గత సంవత్సరం దీనిని నిర్వహించి ఉంటే బాగుండేది.
నేడు ఓటర్లలో తమ ఓట్లు నిజంగా ముఖ్యామా కాదా అనే ఆందోళనను ఇది సృష్టించింది. ముఖ్యంగా పేర్లు తొలగించబడిన మహిళలు, యువతలో అలజడి రేపింది. తొలగింపులు ఏ ఒక్క పార్టీ పైన నిర్ణయాత్మకంగా ప్రభావం చూపకపోవచ్చు.
‘సర్’ పై ఓటర్లు, యువత కోపంగా ఉన్నారా?
సర్ కంటే సమస్యల ఆధారిత అంశాలు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. తొలగింపులు కొన్ని సమూహాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మహిళలు. వారంతా సీఎం నితీశ్ కుమార్ కు అండగా నిలబడేవారు.
కానీ జాబితాలో మెజారిటీ వారిదే. అందువల్ల సర్ తో చర్చను సృష్టిస్తున్నప్పటికీ అది ఓటర్ల సెంటిమెంట్ ను ప్రభావితం చేయదు. ప్రజలు జీవనోపాధి, విద్య, భవిష్యత్ అవకాశాల గురించి ఎక్కువ ఆందోళన పడుతున్నారు.
నితీశ్ కుమార్, తేజస్వీయాదవ్, ప్రశాంత్ కిషోర్ లు మధ్య జరుగుతున్నాయా?
బీహర్ రాజకీయాలలో ఏ నాయకుడికి బ్రహ్మరథం పట్టరు. నితీశ్ కుమార్ తన పాలన, నాయకత్వం పట్ల గౌరవం ఉంది. కానీ ఆయనకు ఆరోగ్యం సరిగాలేదు. ఎన్డీఏ ప్రచారాన్ని చురుకుగా నడిపించే సామర్థ్యం కనిపించడం లేదు.
తేజస్వీ యాదవ్ కు ఆయన సొంత సమాజంలో ఆదరణ దక్కుతోంది. తండ్రి నుంచి ఇంకా సలహాలు పొందుతూనే కనిపిస్తున్నారు. ఒంటరి నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడం ఇంకా మిగిలి ఉంది.
ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడే నాయకుడిగా ఎదుగుతున్నారు. సోషల్ మీడియా, ప్రజల భాగస్వామ్యం అనే అంశాలలో ఆయన మంచి నైపుణ్యం గణించారు.
సమస్యలను హైలైట్ చేయడంలో వాటికి ఎన్డీఏ పాలకులను జవాబుదారీగా నిలపడంలో నైపుణ్యం ఉంది. ఆయన ప్రభావం కచ్చితంగా మహా ఘట్ బంధన్ కు కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా ఎంతవరకూ ప్రభావం చూపుతారనేది మున్ముందు తెలుస్తుంది.
మహిళలకు నగదు బదిలీ పథకం ఎంత ప్రభావం చూపవచ్చు?
మహిళలకు నేరుగా డబ్బును బదిలీ చేసే పథకాలు రాష్ట్రంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ వీటి వల్ల లాభం జరిగింది. అయితే చత్తీస్ గఢ్ లో మాత్రం ఉపయోగపడలేదు.
బీహార్ లో ముఖ్యంగా దీపావళి, ఛత్ పండగలు సమీస్తున్న తరుణంలో వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కొంచెం కష్టమే. ఈ నగదు బదిలీ ఎన్డీఏకి ఈబీసీ వర్గాల మహిళలకు సహాయపడవచ్చు. కానీ ఇప్పుడే వాటిపై ఓ నిర్ణయానికి రాలేము.
బీహర్ ఎన్నికలలో మతతత్వం ప్రధాన కారకంగా పనిచేస్తుందా?
ఇక్కడ రాజకీయాలు మతపరమైన గుర్తింపు కంటే ప్రజల జీవనోపాధి పైనే గురి పెట్టాయి. పూర్నియా, కతిహార్, సహర్సా వంటి ప్రాంతాలలో మైనారిటీ జనాభా అధికంగా ఉంది. కానీ హిందువులు, ముస్లింలు ఎక్కువగా విడివిడిగా నివసిస్తున్నారు. వారి స్వంత సంస్కృతి, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
‘సర్’ వల్ల ఎక్కువ సంఖ్యలో చొరబాటుదారులు ఉన్నట్లు వెల్లడికాలేదు. జనాభా ముప్పు వాదనలు అబద్దం అని తేల్చింది. బీహర్ లోని బలమైన ప్రాంతీయ నాయకుల కథనాల కంటే స్థానిక సమస్యలు కేంద్రంగా ఉంది. బీహర్ లో జరగబోయే ఎన్నికలు అభివృద్ది సమస్యలు, ఓటర్ల ఆకాంక్షలు, నాయకత్వ అవగాహాన వంటి అంశాలపై ఆధారపడి ఉంది.
కులం కొంత గుర్తింపు పాత్ర పోషిస్తూనే ఉన్నప్పటికీ సమస్యల ఆధారిత ఆందోళనలు చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, ప్రశాంత్ కిషోర్ పనితీరు వ్యూహాలు రాష్ట్రంలో తక్షణ ఫలితాలు, భవిష్యత్ రాజకీయ దారులను రూపొందిస్తాయి.