‘గౌతమ్ ఆదానీ’ ని వెంటనే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ
అమెరికా కోర్టులో లంచం ఆరోపణల కేసు నమోదయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ గౌతమ్ ఆదానీపై విమర్శలు గుప్పించారు.
By : 491
Update: 2024-11-27 08:44 GMT
భారత దిగ్గజ వ్యాపార వేత్త ఆదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ ఆదానీపై అమెరికాలో లంచం ఆరోపణల కేసు నమోదయిన నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గౌతమ్ ఆదానీకి నరేంద్ర మోదీ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు.
అదానీ ఎందుకు జైలులో లేరని పార్లమెంటు వెలుపల విలేకరులతో రాహుల్ ప్రశ్నించారు, అదే మోదీ ప్రభుత్వం చిన్న చిన్న ఆరోపణలపై వందలాది మందిని అరెస్టు చేసిందని విమర్శించారు.
యుఎస్‌లో అదానీపై కేసు..
భారత దేశంలోని ఉన్నతాధికారులకు సోలార్ ప్రాజెక్ట్ ల కోసం ఆదానీ గ్రూపు చైర్మన్, అతని మేనల్లుడు సాగర్ ఆదానీ, కంపెనీ ఉన్నతాధికారి వినీత్ జైన్ లపై వాష్టింగ్టన్ లోని డిస్ట్రిక్ట్ కోర్టు లో కేసు దాఖలు అయింది. భారత అధికారులకు లంచం కింద రూ. 2000 వేల కోట్లను అందించారని వారు ఆరోపించారు.
ఈ ప్రాజెక్ట్ లన్నీ కూడా 20 ఏళ్ల కాలంలో 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూరుస్తాయని కేసులో తెలిపారు. అయితే ఈ ఆరోపణలను గ్రూప్ ఖండించింది. యూఎస్ లో నమోదయిన కేసులు కేవలం జరిమానాతో ఉన్నవేనని అన్నారు.
రాహుల్ తోసిపుచ్చారు...
ఆదానీ గ్రూపు లంచం ఆరోపణలను తిరస్కరించడం పై కూడా రాహుల్ గాంధీ స్పందించారు. "అదానీలు ఆరోపణలను అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా. మీరు ఏ ప్రపంచంలో నివసిస్తున్నారు? అతను ప్రతి ఆరోపణలను తిరస్కరిస్తున్నాడు," అని రాహుల్ చెప్పారు.
అదానీపై రాహుల్ విమర్శలు..
"అతన్ని అరెస్టు చేయాల్సిన విషయం.. మనం చెప్పినట్లు, చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్టు చేస్తున్నారు. పెద్దమనిషిని యునైటెడ్ స్టేట్స్లో వేల కోట్ల అభియోగాలు మోపారు, అతను జైలులో ఉండాలి ... ప్రభుత్వం అతడిని రక్షిస్తోంది' అని రాహుల్ అన్నారు. అంతకుముందు, అదానీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, అదానీ లేదా అతని సహచరులపై నిర్దిష్ట ఆరోపణలు లేవు. లంచం ఆరోపణలు చాలా సాధారణమైనవన్నారు.