ఒప్పందం కుదిరిన ఇరవై నాలుగు గంటల్లోనే హింస
మణిపూర్ లో ట్రైబ్ - మొయితీల మధ్య ఒప్పందం కుదిరిన 24 గంటల్లోనే మణిపూర్ మరోసారి హింస ప్రజ్వరిల్లింది. ఈ సారి ప్రశాంతంగా ఉండే జిరిబామ్ ప్రాంతంలో..
మణిపూర్ లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిరిబామ్ లో ఓ ఇంటిని అల్లరి మూకలు తగలబెట్టాయి. జిల్లాలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేయడానికి మెయితీ, కుకీ కమ్యూనిటీలు ఒప్పందం కుదుర్చుకున్న ఒక రోజులోనే ఈ అల్లర్లు చెలరేగాయి.
లాల్పాని గ్రామంలోని ఒక పాడుబడిన ఇంటిని శుక్రవారం రాత్రి సాయుధ వ్యక్తులు తగులబెట్టారని వారు తెలిపారు. "ఇది కొన్ని మెయిటీ ఇళ్ళతో కూడిన ఒక స్థావరం, జిల్లాలో హింస చెలరేగిన తర్వాత వాటిలో చాలా వరకు ప్రజలు వదిలి వేశారు. అయితే ఈ దుశ్చర్యకు పాల్పడింది ఎవరో ఇప్పటి వరకూ గుర్తించబడలేదు.
ఆ ప్రాంతంలోని భద్రతా లోపాలను ఉపయోగించుకుని కాల్పులకు పాల్పడ్డారు," ఒక అధికారి తెలిపారు.సాయుధ వ్యక్తులు గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ఈ ఘటనతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు.