చిదంబరం వల్లే మణిపూర్ సమస్య: సీఎం బీరెన్ సింగ్

మణిపూర్ సంక్షోభంపై సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలను కుకీ తీవ్రవాదులు అపహరించి హత్య చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా..

By :  491
Update: 2024-11-20 08:25 GMT

గత సంవత్సరం నుంచి రావణకాష్టంలా రగులుతున్న మణిపూర్ లో తాజాగా మరోసారి చిచ్చు రగిలింది. మైతీలపై కుకీ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై తొలిసారిగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత సంక్షోభాన్ని సృష్టించారని సీఎం విమర్శించారు.

కుకీ తీవ్రవాదులను ఆరుగురు అమాయక మైతీ ప్రజలను దారుణంగా చంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరంగా అభివర్ణించారు. నేరస్తుల కోసం వేట కొనసాగుతుందని, వారు దొరికే వరకూ సెర్చింగ్ కొనసాగుతుందని ప్రకటించారు.
జిరిబామ్ జిల్లాలోని ఓ శిబిరం నుంచి ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్న పిల్లలను కుకీ తీవ్రవాదులు అపహరించి హత్య చేశారు. వారి మృతదేహాలు సమీపంలోని ఓ నదీలో లభ్యమయ్యాయి. ఈ సంఘటనతో మైతీ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తున్నారు.
ఎక్కడ కిడ్నాప్ చేశారు..
నవంబర్ 11న జరిగిన ఘటనపై, సాయుధ కుకీ తీవ్రవాదులు ఉన్నారని రాష్ట్ర పోలీసులు చెప్పారు. జిరిబామ్ జిల్లాలోని నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరం పై కుకీ- జో గ్రూప్ ఉగ్రవాదులు దాడి చేశారు. వారికి రక్షణగా సీఆర్పీఎఫ్ జరిపిన దాడిలో పదిమంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే సందర్భంలో ఆరుగురు మైతీ ప్రజలను వారు ఎత్తుకెళ్లారు. తరువాత వారినీ హత్య చేసిన నదీలో వదిలేశారు.
జిరిబామ్‌కు న్యాయం..
ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాత్రి ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘ జిరిబామ్ లో బందీలుగా తీసుకున్న ముగ్గురు అమాయక పిల్లలు, ముగ్గురు అమాయక మహిళలను కుకీ ఉగ్రవాదులు అపహరించి చంపడం పై నేను ఖండిస్తున్నారు. తీవ్ర విచారం, కోపంతో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను’’ అని వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఇలాంటి అనాగరిక చర్యలకు ఏ నాగరిక సమాజంలో చోటు లేదని, ప్రస్తుతం ఈ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని, త్వరలోనే వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నామని, అప్పటి వరకు విశ్రమించబోమని సీఎం అన్నారు.
ప్రజలను కాపాడటానికి సీఆర్పీఎఫ్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. బోరోబెక్రా వద్ద సహాయ శిబిరాల్లో నివసిస్తున్న వందలాంది మంది ప్రజలను రక్షించిందని చెప్పారు.
" బోరోబెక్రా వద్ద సహాయక శిబిరంలో నివసిస్తున్న వ్యక్తులపై దాదాపు 40 నుంచి 50 మంది సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. జిరిబామ్‌లోని పోలీసు స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. వారి లక్ష్యం భయం, విధ్వంసం వ్యాప్తి చేయడం. అయితే వారి లక్ష్యాన్ని భద్రతా బలగాలు వమ్ము చేశాయి’’ అని సీఎం ప్రశంసించారు.
భారీ నిరసనలు..
హీంగాంగ్ లోని ఉన్న సీఎం, మంత్రుల నివాసాలపై మైతీలు దాడులు చేయడంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఈ ఘటన తరువాత కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుంది.
బీరెన్ సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వం "సంక్షోభాన్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది" అని పేర్కొంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రస్తుతం ఉన్న బలగాలే కాకుండా మరో 20 కంపెనీల బలగాలు పంపించారని చెప్పించారు. కుకీ- జో గ్రూప్ 'కొరియోగ్రాఫిక్ పొలిటికల్ డ్రామా'ని ఖండించారు.
ఎమ్మెల్యేల సమావేశం..
పరిస్థితి ఇలా ఉండగా.. సోమవారం (నవంబర్ 18) ఇంఫాల్‌లో జరిగిన ఎన్‌డిఎ ఎమ్మెల్యేల సమావేశంలో విడుదల చేసిన తీర్మానాన్ని కాంగ్‌పోక్పి జిల్లాకు చెందిన కుకీ-జో గ్రూప్ COTU ఖండించింది. ఈ సమావేశానికి మైతీ, నాగా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
మైతీ-ఆధిపత్యం ఉన్న లోయ ప్రాంతాల్లోని ఆరు పోలీస్ స్టేషన్‌లలో AFSPAని పునఃప్రారంభించడాన్ని సమీక్షించాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. మైతీలపై దాడులకు పాల్పడుతున్న కుకీ- జో ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని, ఆయా సంస్థలను చట్టవిరుద్దమైన సంస్థలుగా ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది. కుకీ-జో సమూహం "మైనారిటీ కుకీ-జోపై రాజకీయ ఆధిపత్యం చెలాయించడానికి ఈ తీర్మానాన్ని ఓ ఉదాహారణ అని విమర్శించారు.


Tags:    

Similar News