అరుణాచల్ ప్రదేశ్ లో చైనా నాటకం

అరుణాచల్ ప్రదేశ్ తన భూభాగం అని చెప్పేందుకు చైనా తమాషా చేస్తూ ఉంది. ఇంతవరకు మూడు అంకాలు నడిచాయి. ఇపుడు నాలుగో అంకం విడుదల చేసింది. వివరాలు

By :  Admin
Update: 2024-04-05 06:55 GMT

భారత్‌తో వివాదం ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఉన్న మరో 30 స్థలాలకు చైనా పేరు మార్చింది. అరుణా చల్ ప్రదేశ్ తన  భూభాగం అని చెప్పేందుకు చైనా ఎంచుకునక్న మార్గం ఇది. ఇలా ఇక్కడి ప్రదేశాలకు చైనాలో భాషలో పేర్లు మార్చడం రెగ్యులర్ గా చేస్తూ ఉంది.

శనివారం చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలకు చైనా భాషలో తాజా "ప్రామాణిక" పేర్లను ప్రచురించింది. ఇలా చేయడం  ఇది నాలుగో సారి.

అరుణాచల్ ప్రదేశ్ ని చైనా తన భూభాంగా చాలా కాలంగా  చెప్పుకుంటూ ఉంది. అక్కడికి భారత ప్రధానులు పర్యటించినపుడల్లా నిరసన చెబుతూ ఉంటుంది. అరుణా చల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా చైనా భాషలో జంగ్నాన్ ప్రాంతంగా పిలుస్తున్నది. చైనాలోని జంగ్నాన్ టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతాలలో అరుణాచల్ ప్రదేశ్ భాగమని పేర్కొంది.

పేరు మార్చడం ద్వారా 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, భూమి తమ సొంతమయినట్లు చైనా భావిస్తూ ఉంది. ఈ పేర్లలో చైనీస్ అక్షరాలు, టిబెటన్, పిన్యిన్, మాండరిన్ చైనీస్ అక్షరాలు ఉన్నాయి. వాటిన రోమన్ వర్ణమాల వెర్షన్‌లో ప్రచురించింది.

అంతేకాదు,ఈ పేర్ల మార్పడి తర్వాత అధిక-రిజల్యూషన్ మ్యాప్‌ను కూడా తయారు చేసింది.

"భౌగోళిక పేర్ల నిర్వహణపై స్టేట్ కౌన్సిల్ [చైనా క్యాబినెట్] నిబంధనలకు అనుగుణంగా, చైనాలోని జాంగ్నాన్‌లోని కొన్ని భౌగోళిక పేర్లను ప్రామాణికం చేశాము" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత ఏడు సంవత్సరాలలో చేసిన మూడు సార్లు అనేక ప్రదేశాల పేర్లను మార్చింది. ఇపుడు విడుదల చేసిన నాలుగో జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ లోని మరిన్ని భాగాలను చేర్చింది.

చైనా, భారతదేశం తమ సరిహద్దు విభజనను ఎన్నడూ అంగీకరించలేదు మరియు 1962లో ఈ సమస్యపై ఒక యుద్ధం కూడా జరిగింది. అపుడు ఒక అంగీకారాని వచ్చి 3,200km (1,990-మైలు) వాస్తవ నియంత్రణ రేఖ నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ వారు ఆ విభజన రేఖ ఎక్కుడుందో ఎవరిలో స్పష్టత లేదు.

అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ మధ్య ఉన్న విభజన రేఖను బ్రిటీష్ కాలానికి చెందిన అధికారి మెక్‌మోహన్ నిర్ణయించారు.దీనిని మెక్ మోహన్ లైన్ అంటుంటారు. అయితే, చైనా ఎన్నడూ అంగీకరించలేదు.

ఈ నెల ప్రారంభంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ భూభాగాన్ని సందర్శించడంపై చైనా నిరసన వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై భారత్ స్పందిస్తూ ఆ భూభాగంపై చైనా దావా “అసంబద్ధం” అని పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగమని చెబుతూ తమ భూభాగంలోని ప్రదేశాలకు పేర్లు మార్చడానికి చేసే ప్రయత్నాలను "గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు" భారత్ పేర్కొంది. దీనికి అమెరికా మద్దతునిచ్చింది.

చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వు కియాన్ గురువారం దీని మీద స్పందిస్తూ “యుఎస్ కు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాల మధ్య వివాదాలను రేకెత్తించే భయంకరమైనచరిత్ర ఉంది. అంతర్జాతీయ సమాజం దానిని స్పష్టంగా గమనిస్తూ ఉంది. చైనా భారతదేశం బలమయిన యంత్రాంగాలు, కమ్యూనికేషన్ మార్గాలను కలిగి ఉన్నాయి. సంభాషణలు, సంప్రదింపుల ద్వారా సరిహద్దు ప్రశ్నను సరిగ్గా పరిష్కరించుకునే సామర్థ్యం సుముఖత ఇరుపక్షాలకు ఉంది.”

అయినప్పటికీ, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి హక్కు ఉందనడాన్ని కూడా ఆయన తిరస్కరించాడు: "జాంగ్నాన్ పురాతన కాలం నుండి చైనా భూభాగంగా ఉంది, ఇది 'అరుణాచల్ ప్రదేశ్' ఎలా అయింది?" అని ఆయన ప్రశ్నించాడు.

చైనా ఆధీనంలో ఉన్న అక్సాయ్ చిన్, భారత ఆధీనంలో ఉన్న కాశ్మీర్ , లడఖ్ మధ్య పశ్చిమాన వేల కిలోమీటర్ల మేరకు రెండు దేశాలకు దీర్ఘకాలంగా సరిహద్దు వివాదం ఉంది, దీని ఫలితంగా నాలుగు సంవత్సరాల క్రితం గాల్వాన్ లోయలో ఘోరమైన ఘర్షణ జరిగింది.

ఎవరి ఇంటికో పేరు మార్చి, ఇది నా ఇల్లు అంటే వోనర్సిఫ్ వస్తుందా అని భారత విదేశాంగ మంత్రి  ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News