పరీక్షలను వాయిదా వేసిన మణిపూర్ వర్సిటీ

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలను వాయిదా వేసింది.

Update: 2024-09-11 13:01 GMT

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వర్సిటీ తెలిపింది. విద్యార్థులు రాజ్‌భవన్‌కు చేపట్టిన మార్చ్‌ హింసాత్మకంగా మారింది. రాజ్ భవన్ వైపుగా వెళ్లేందుకు పోలీసులు అడ్డు చెప్పడంతో భద్రతా సిబ్బంది, విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 55 మందికి పైగా విద్యార్థులు, భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత మణిపూర్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య బుధవారం ఇంఫాల్ నుంచి గౌహతికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను అదుపు చేయలేని డిజిపి, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

కర్ఫ్యూ విధించిన ఇంఫాల్ లోయలో బుధవారం ఎలాంటి తాజా నిరసనలు, హింసాత్మక సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. రాష్ట్ర రాజధానిలోని సున్నిత ప్రాంతాల్లో బారికేడింగ్‌లు, అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం నిషేధాజ్ఞలను ధిక్కరించిన నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. ఇంఫాల్‌లోని బిటి రోడ్ , కక్వా ప్రాంతంలో రాళ్లు రువ్వడంతో పాటు రాజ్ భవన్‌కు చేరుకోవడానికి పోలీసు సిబ్బందిపై దాడికి ప్రయత్నించాయి. సోమవారం ఉదయం నుంచి విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాత్రి కూడా ఖ్వైరాంబండ్‌లోని మార్కెట్‌ ప్రాంతాల్లో క్యాంపు చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఇంఫాల్ కాలేజ్, ఇబోతోన్సనా హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులతో సమావేశమయ్యారు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News