‘నేనేం తొందరపడడం లేదు’
కర్ణాటకలో నాయకత్వ వివాదం మళ్లీ తెరపైకి రావడంతో తుది నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటుందన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కర్ణాటక(Karnataka)లో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva kumar) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. సీఎం పదవి కోసం తానేం తొందర పడడం లేదని, ఆ విషయం కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. వొక్కలిగ వర్గానికి చెందిన ఆధ్యాత్మిక గురువు నంజవదుత స్వామీజీతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) మాత్రమే తన వర్గమని, సమాజంలోని అన్ని వర్గాలను తాను ప్రేమిస్తానని చెప్పారు.
తన ఢిల్లీ పర్యటనపై వస్తున్న ఊహాగానాలను కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే తోసిపుచ్చారు. రాష్ట్రంలోని రైతుల సమస్యపై పార్టీ ఎంపీలతో మాట్లాడటానికి తాను ఢిల్లీకి వెళ్లానని చెప్పారు.
"కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఢిల్లీలోని పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపిస్తుంది. వారు పిలిస్తే నేను, పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి వెళ్తాం. ఢిల్లీలో నాకు చాలా పని ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వస్తున్నాయి. నేను పార్లమెంటు సభ్యులను కలవాలి. వారు పార్లమెంటులో మా ప్రాజెక్టుల గురించి చెప్పేవారు మావాళ్లే కదా, ”అని శివకుమార్ అన్నారు.
"మా ముఖ్యమంత్రి (CM Siddaramaiah) (కేంద్రంతో) సమస్యలపై చర్చిస్తున్నారు. మొక్కజొన్న సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ యజమానుల సమావేశం ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాము.," అని చెప్పారు.
శివకుమార్ తన Xలో ఇలా రాసుకొచ్చారు. ‘‘మాట నిలబెట్టుకోవడం గొప్ప విషయం. అది న్యాయమూర్తి అయినా, అధ్యక్షుడు అయినా లేదా నేనయినా లేక మరెవరైనా ప్రతి ఒక్కరూ మాట ప్రకారం నడుచుకోవాలి." అని రాసుకొచ్చారు.