వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంపు

ఇకపై 14.2 కిలోల ఎల్‌పీజీ(LPG) సిలిండర్ ధరకు సాధారణ వినియోగదారులు రూ.853, ఉజ్వల పథకం వినియోగదారులు రూ.553 చెల్లించాలి.;

Update: 2025-04-07 12:14 GMT

కేంద్రం మరోసారి వంట గ్యాస్(Cooking gas) సిలిండర్ ధరలను పెంచింది. ప్రస్తుత ధరపై రూ.50లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల, జనరల్ కేటగిరీ వినియోగదారులకు మాత్రమే పెంచిన రెట్లు వర్తిస్తాయని కేంద్ర చమురు మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం తెలిపారు.

సాధారణ వినియోగదారులు ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్‌కు రూ.803 చెల్లిస్తున్నారు. రూ. 50 పెంచడంతో ఇకపై రూ.853 చెల్లించాలి. అలాగే ఉజ్వల పథకం వినియోగదారులు రూ.503 చెల్లించేవారు. ఇక నుంచి రూ.553 చెల్లించాలి.

కారణం అదే..

ప్రభుత్వం సోమవారం వాహన ఇంధనాలపై ఎక్సైజ్(Excise) సుంకాన్ని లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది. పెట్రోల్(Petrol )పై లీటరుకు రూ.13కు, డీజిల్(Diesel)పై రూ.10కి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

రేపటి నుంచి అమల్లోకి రానున్న ఈ పెంపు వినియోగదారులపై పడదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు భరిస్తాయి. ఈ మేరకు ఆ కంపెనీలపై భారం పడకుండా ఉండేందుకు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. 

Tags:    

Similar News