‘బీహార్‌లో శాంతిభద్రతలు క్షీణించాయి’

‘అధికారంలోకి తెస్తే ఇంటికో ఉద్యోగం’ - I.N.D.I.A కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్

Update: 2025-10-28 11:13 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు, భారత కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మంగళవారం (అక్టోబర్ 28) ఆరోపించారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాని గురించి కనీసం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరన్‌లోని మార్హౌరాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తేజస్వి ప్రసంగించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, శాంతి భద్రతల పరిరక్షణకు భారత కూటమి(I.N.D.I.A Alliance)ని అధికారంలోకి తేవాలని ఓటర్లను కోరారు.


‘ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం..’

"సరణ్‌లో రోజూ హత్యలు, అపహరణలు, దోపిడీలు జరుగుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వాటి గురించి అస్సలు పట్టించుకోరు. కనీసం బాధితులను ఓదార్చడానికి కూడా ఆయన రారు. అదుపుతప్పిన శాంతిభద్రతలను గాడిలో పెట్టడానికి, యువతకు ఉపాధి అవకాశాల కోసం ఇండియా బ్లాక్‌కు ఓటు వేయండి" అని యాదవ్ విజ్ఞప్తి చేశారు. తన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.

243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు 14వ తేదీన ప్రకటిస్తారు. 

Tags:    

Similar News