పెళ్లికి నిరాకరించాడని.. లేడీ డాక్టర్ ఏం చేసిందంటే..
వాళిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఎందుకో తెలియదు..ప్రియుడు పెళ్లికి నిరాకరించారు. దాంతో కోపంతో లేడీ డాక్టర్ ఏం చేసినందే..
Update: 2024-07-02 07:31 GMT
బీహార్ రాష్ట్రం సరన్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల లేడీ డాక్టర్, 30 ఏళ్ల యువకుడు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరోజు ప్రియుడిని క్లినిక్‌కు పిలిపించి అతని జననేంద్రియాలను కత్తితో కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో అతని కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు లేడీ డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో..‘‘మేమిద్దరం గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. పెళ్లి ప్రస్తావన తేగానే మొహం చాటేసేవాడు. ఆయన వల్ల ఇప్పటికే రెండుసార్లు అబార్షన్లు కూడా చేయించుకున్నా. చివరకు కోర్టులో రిజిస్టర్ మ్యారేజీకి ఒప్పించా. ఆ రోజు కోర్టుకు వస్తాడని చాలాసేపు ఎదురుచూశా. కాని రాలేదు. తర్వాత నా క్లినిక్ రమ్మని చెప్పా.’’ అని లేడీ డాక్టర్ వివరించింది.