జాట్లను ఓబీసీలో చేర్చాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ..

జాట్ కమ్యూనిటీ (Jat community) ఓట్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కీలకం కానున్నాయి. మొత్తం ఓటర్లలో వారు సుమారు 8 నుంచి10 శాతం ఉన్నారు.;

Update: 2025-01-09 09:14 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధాని మోదీ(PM Modi)కి లేఖ రాశారు. జాట్ కమ్యూనిటీ(Jat community)ని వెనుకబడిన తరగతుల(ఓబీసీ) జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫలితంగా విద్య, ఉద్యోగాల్లో వారు రిజర్వేషన్లు పొందే వీలుంటుందని పేర్కొ్న్నారు. రాజస్థాన్‌కు చెందిన జాట్‌లకు ఓబీసీ(OBC) రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందుతున్నారని, అయితే అదే కమ్యూనిటీకి చెందిన ఢిల్లీ జాట్‌లకు ఈ ప్రయోజనాలు ఎందుకు వర్తించమని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేజ్రీవాల్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది

లేఖలో ఏం రాశారు?

"ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన డజన్ల కొద్దీ కాలేజీలు ఉన్నాయి. ఢిల్లీ పోలీస్, ఎన్‌డిఎంసీ, డిడిఎ, ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్, రామ్ మనోహర్ లోహియా వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ నిబంధన ఉల్లంఘన కారణంగా ఢిల్లీ ఓబీసీ సమాజానికి చెందిన వేలాది యువతకు అన్యాయం జరుగుతోంది. గత 10 సంవత్సరాల నుంచి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ ఢిల్లీలో జాట్ సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు మాత్రమే ఢిల్లీ జాట్‌లను ప్రధానమంత్రి, హోం మంత్రి గుర్తు పెట్టుకుంటారు," అని అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.

ఈసీని కలవనున్న కేజ్రీవాల్..

ఢిల్లీలో ఓటరు జాబితాలో మార్పులు జరుగుతున్నాయని ఆప్ అనుమానం వ్యక్తం చేస్తోంది. దళిత సామాజికవర్గాలు, నిరాశ్రయులు, పూర్వాంచల్ ప్రజల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు కేజ్రీవాల్ ఇవాళ ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఎంపీ సంజయ్ సింగ్ కేజ్రీవాల్‌ వెంట వెళ్లనున్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

70 మంది సభ్యులున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 8న ఉంటుంది. 

Tags:    

Similar News