కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే..సుప్రీంలో రేపు విచారణ..

మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు బెయిల్ దొరుకుతుందా? రేపు ఆయన బెయిల్‌పై సుప్రీం తీర్పు ఉత్కంఠ రేపుతోంది.

Update: 2024-06-25 11:21 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. మద్యం కుంభకోణంతో ముడిపడివున్న మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ట్రయల్ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. ట్రయిల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరుసటి రోజు హైకోర్టును ఆశ్రయించింది. దాంతో ట్రయిల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ .. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. 26వ తేదీన విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ బెయిల్‌పై కీలక ఉత్తర్వులు వెలువరించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే కొనసాగుతుందని ప్రకటించింది. దీంతో కేజ్రీవాల్‌ మరికొన్ని రోజుల పాటు తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే పై అత్యున్నత న్యాయస్థానంలో రేపు (జూన్ 26న) విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News