New Delhi | కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: ఆప్ చీఫ్ కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

Update: 2024-12-01 12:40 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఎలక్షన్లకు ముందు పార్టీల పొత్తులు సాధారణం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ప్రకటించారు. ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. "ఢిల్లీలో పొత్తు ఉండదు" అని విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆప్, కాంగ్రెస్ ప్రతిపక్ష భారత కూటమిలో భాగస్వాములు. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. బీజేపీ మొత్తం ఏడు స్థానాలను గెలుచుకోగా, రెండు పార్టీలు ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. అక్టోబర్‌లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు పార్టీలు పలు దఫాలుగా చర్చలు జరిపినా.. సీట్ల పంపకంపై ఒప్పందం కుదరలేదు. అందులోనూ అక్కడ బీజేపీ విజయం సాధించింది.

మార్షల్స్‌ను తిరిగి నియమించాలి: ఢిల్లీ సీఎం అతిశీ

మహిళా ప్రయాణికుల భద్రత కోసం నగరంలోని బస్సుల్లో మార్షల్స్‌ను మళ్లీ నియమించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. మహిళలకు రక్షణగా నిలవడంలో మార్షల్స్ కీలక పాత్ర పోషించారని చెబుతూ.. ముఖ్యమంత్రిపై కుట్రలో భాగంగానే వారిని తొలగించారని, భద్రతా చర్యలను బలహీనపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన కొందరు అధికారులు కేంద్రం ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

Tags:    

Similar News