వక్ప్ బిల్లు: 14 సవరణలను ఆమోదించిన జేపీసీ

ప్రతిపక్షం చేసిన ప్రతి సవరణను తిరస్కరించిన కమిటీ;

Update: 2025-01-27 09:58 GMT

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వక్ప్ సవరణ బిల్లుకు జేపీసీ 14 సవరణలు ప్రతిపాదించింది. ఈ నివేదికను పార్లమెంట్ కు సమర్పించనున్నట్లు వెల్లడించింది. అయితే ఈసవరణలన్నీ కూడా కూడా అధికార బీజేపీ ఎంపీలే ప్రతిపాదించినవి కావడం గమనార్హం. అలాగే ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన ప్రతి సవరణను తిరస్కరించినట్లు నివేదించారు. ముసాయిదా చట్టానికి దాదాపుగా 572 సవరణలను ప్యానెల్ లోని సభ్యులు సూచించారు.

వక్ప్ బోర్డు చేస్తున్న అరాచకాలపై దేశంలోని మెజారిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వక్ప్ చట్టం 1995 కు సవరణ చేయాలని ఎన్డీఏ సర్కార్ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే గత ఏడాది వక్ప్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో దీన్ని జేపీసీకి పంపారు.
విపక్షాలు సహకరించడం లేదు..
కమిటీ ఆమోదించిన సవరణలు చట్టం మరింత సమర్థవంతంగా తయారు కావడానికి ఉపయోగపడుతుందని కమిటీ చైర్మన్ జగదాంబిక పాల్ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు. అయితే ప్రతిపక్షం ఈ వ్యాఖ్యలను ఖండించింది. పాల్ ప్రజాస్వామ్య ప్రక్రియను అపహస్యం చేశారని విమర్శించారు. ‘‘ ఇదో నవ్వులాట, పాల్ కమిటీలో నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించారు’’ అని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విలేకరులతో అన్నారు.
అయితే జగదాంబిక పాల్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. మొత్తం ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని, మెజారిటీ సభ్యుల అభిప్రాయం ఇందులో బలంగా వినిపించారని చెప్పారు.
ముఖ్యమైన సవరణ..
కమిటీ ప్రతిపాదించిన ముఖ్యమైన సవరణలలో ఒకటి ప్రస్తుత చట్టంలో ఉన్న‘‘ వక్ఫ్ బై యూజర్’’ అనే కొత్త ప్రాతిపదికన ప్రస్తుత వక్ప్ ఆస్తులను ప్రశ్నించలేము. అయితే ఆ ఆస్తులు మత అవసరాల కోసం ఉపయోగించినట్లు అయితే వాటిని విడిచిపెడతారు. ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన వందలాది సవరణలు ఓటింగ్ లో వీగి పోయాయని చైర్మన్ జగదాంబిక పాల్ చెప్పారు.
అనేక సవరణలు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీపీ లో మెంబర్లు దాదాపు 572 సవరణలు ప్రతిపాదించారు. వీటిపై ప్రతిపక్ష సభ్యులు గట్టి పట్టుబట్టడంతో పదిమంది ఎంపీలను సస్పెండ్ చేసి తరువాత ప్యానెల్ సభ్యులు సమావేశం అయ్యారు.
ప్యానెల్ విచారణ చివరి ఘట్టంలోని ప్రవేశించడంతో ఆదివారం అర్థరాత్రి బీజేపీ నేత జగదాంబిక పాల్ అధ్యక్షతన వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ కమిటీ సవరణల ఏకీకృత జాబితాను విడుదల చేసింది. సోమవారం జరిగే సమావేశంలో ఈ సవరణలను క్లాజ్ ల వారీగా కమిటీ సవివరంగా చర్చించి అందులో 14 సవరణలను ఆమోదించింది. ఇందులో బీజేపీ సభ్యులతో పాటు, ప్రతిపక్ష సభ్యులు కూడా సవరణలు సమర్పించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇందులో బీజేపీ మిత్ర పక్షాల నుంచి ఎటువంటి సవరణలు రాలేదు.
దేశంలో వక్ఫ్ బోర్డ్ కు విస్తృత అధికారాలున్న నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లు-2024 ను కేంద్ర మైనారిటీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశ పెట్టిన తరువాత ఆగష్టు 8న పార్లమెంట్ సంయుక్త కమిటీకి సిఫార్సు చేసింది. వక్ప్ చట్టం-1995 కు సవరణ చేయడానికి ఈ బిల్లును ప్రవేశ పెట్టారు.



Tags:    

Similar News