జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నేతల సమావేశం.. కారణమేంటి?

కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోన్న బిజెపి.. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాక్కుంది. వారికి హక్కులు కావాలి. కానీ బాధ్యత పట్టదు’’ - ఇండియా కూటమి నేతలు

Update: 2024-07-30 12:31 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో.. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ..ఇండియా బ్లాక్ నాయకులు మంగళవారం జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆదరణకు తగ్గించాలని కుట్రలో భాగంగానే ముగ్గురు సీనియర్ ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌ను జైలులో పెట్టారని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య ఆరోపించారు. ఇటీవల ఢిల్లీ రాజిందర్ నగర్‌లోని ఐఎఎస్ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు యుపిఎస్‌సి ఆశావహుల ప్రాణాలను బలిగొన్నది కూడా కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు.

కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించింది..

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి రాజా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. "మోదీ ప్రభుత్వం ఉపయోగించే కేంద్ర సంస్థల బాధితుల్లో కేజ్రీవాల్ ఒకరు. దీనిని మనం అనుమతించగలమా? దేశంలో ఈ పరిస్థితిని ఇంకా ఎంతకాలం తట్టుకోగలం. కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేదు మరియు అతని ఆరోగ్యం క్షీణించింది" అని ఆయన అన్నారు.

జైలులో ఉంచాలనుకోవడం ముమ్మాటికి కుట్రే..

ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ అదుపు తప్పుతున్నాయన్నారు. "అతనికి ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది, అయితే అతన్ని జైలులో ఉంచడానికి కుట్ర జరిగింది. ప్రతిపక్ష నాయకులను ఎందుకు జైల్లో పెట్టాలని బిజెపి కోరుకుంటుంది? ముగ్గురు UPSC ఆశావహుల మరణాలకు ఎవరు బాధ్యులు?" అని రాయ్ ప్రశ్నించారు.

హక్కులు కావాలి.. బాధ్యత పట్టదు..

"ఈ ఘటనపై లెప్టనెంట్ గవర్నర్ను అడుగుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు. కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోన్న బిజెపి.. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాక్కుంది. వారికి హక్కులు కావాలి. కానీ బాధ్యత పట్టదు’’ అని ఆరోపించారు.

జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను చంపడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ..జూన్ 3 నుంచి జులై 7 మధ్య షుగర్ లెవల్స్ 34 సార్లు పడిపోయాయని ఆయన మెడికల్ రిపోర్టును ఉదహరించారు.

జైల్లో ఉంచడం అమానవీయం

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్చంద్ర పవార్ (NCP-SP) అధినేత శరద్ పవార్ లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ కూడా ఇండియా బ్లాక్ ర్యాలీలో పాల్గొన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తరఫున ఆప్‌, కేజ్రీవాల్‌కు పూర్తి నైతిక మద్దతు ఇచ్చేందుకు మేము వచ్చాం. బీజేపీ దురుద్దేశం తప్ప మరొకటి లేదు’’ అని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ ప్రమాదకర స్థాయికి పడిపోయిందని వైద్య నివేదికలు చెబుతున్నా.. ఆయనను జైల్లో ఉంచడం అమానవీయమని పేర్కొన్నారు.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మార్చి 21 న అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆయన ప్రస్తుతం సీబీఐకి సంబంధించిన కేసులో తీహార్‌లో ఉన్నారు. 

Tags:    

Similar News