‘హర్యానా ప్రభుత్వం హత్నికుండ్ బ్యారేజీ గేట్లను మూసేసింది’

హర్యానా రాష్ట్రంలోని హత్నికుండ్ బ్యారేజీ అన్ని గేట్లను మూసివేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ జలమంత్రిత్వ శాఖ మంత్రి అతిషి ఆరోపించారు.

Update: 2024-06-23 09:22 GMT

హర్యానా రాష్ట్రంలోని హత్నికుండ్ బ్యారేజీ అన్ని గేట్లను మూసివేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ జలమంత్రిత్వ శాఖ మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీలో తాగునీటి కొరత ఏర్పడడంతో హర్యానా నుంచి రావాల్సిన నీటి వాటా కోసం ఆమె నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆదివారం ఆమె దీక్ష మూడో రోజుకు చేరుకుంది. తమ వాటా తమకు దక్కేదాకా దీక్ష విరమించబోనని అతిషి స్పష్టం చేశారు.

''ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా కోసం దీక్ష చేస్తున్నా. హర్యానా ప్రభుత్వం 100 ఎంజీడీల నీటిని తక్కువగా విడుదల చేస్తుంది. ఫలితంగా ఢిల్లీలోని దాదాపు 28 లక్షల మంది ప్రజలకు నీటి కొరత ఏర్పడింది. కొంతమంది జర్నలిస్టులు హత్నికుండ్ బ్యారేజీ నిండుకుండలా ఉందని చెప్పారు. అయితే ఆ నీటిని దేశ రాజధానికి చేరకుండా హర్యానా ప్రభుత్వం అన్ని గేట్లను మూసివేసింది.” అని అతిషి ఎక్స్‌లో పోస్టు చేశారు.

100 ఎంజిడిలు తక్కువ..

నీళ్ల కోసం ఢిల్లీ పక్క రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, హర్యానాలపై ఆధారపడుతుంది. నదులు, కాలువల ద్వారా 1,005 మిలియన్ గ్యాలన్ల (ఎంజిడి) నీటిని పొందుతుంది. హర్యానా నుంచి 613 లక్షల గ్యాలెన్లు రావాలి. కొన్ని వారాలుగా అక్కడి నుంచి 513 లక్షల గ్యాలెన్లు మాత్రమే వస్తున్నాయి. 100 లక్షల గ్యాలెన్లు తక్కువ కావడం వల్ల ఢిల్లీలోని 28 లక్షల మంది తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు.  

Tags:    

Similar News