Farmers Agitation | రైతులతో చర్చలు జరపాలంటున్న NDA మిత్రపక్షాలు..

రెండు నెలల క్రితం హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ విజయం సాధిచింది. అదే జోరు ఢిల్లీ ఎన్నికలో కొనసాగుతుందని కాషాయ పార్టీ విశ్వాసంగా ఉంది.;

Update: 2024-12-10 07:39 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాట్‌ సామాజిక వర్గ ఓట్ల కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతుండగా.. కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని కూటమి భాగస్వాములు కోరుతున్నారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి రైతు సంఘాల నాయకులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

ఆమెతో సమావేశమైన భారతీయ కిసాన్ యూనియన్ (అరజనిక్) జాతీయ అధికార ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ ఫెడరల్‌తో మాట్లాడుతూ..“కేంద్ర ప్రభుత్వం, నిరసనకారులకు మధ్య చర్చలు జరపాలని నిర్మలా సీతారామన్‌ను కోరాం. చర్చలు జరపడం ద్వారానే ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆమెకు చెప్పాం. దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లే.. వ్యవసాయం రంగంలోనూ అలాంటి చర్యలే తీసుకోవాలి.’’అని ఆమెను కోరామని చెప్పారు ధర్మేంద్ర.

ఉత్తరప్రదేశ్ RLD రాష్ట్ర అధ్యక్షుడు రామశిష్ రాయ్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి జయంత్ సింగ్‌ను నిరసన తెలుపుతున్న రైతులు కోరారని చెప్పారు.

ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందా?

రెండు నెలల క్రితం హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ విజయం సాధిచింది. అదే జోరును ఢిల్లీ ఎన్నికలో కొనసాగుతుందని కాషాయ పార్టీ విశ్వాసంగా ఉంది. ఇక 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. జాట్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య పోరు మొదలైంది. కొనసాగుతున్న రైతు నిరసనలతో బీజేపీకి జాట్లు దూరమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆప్‌లో ప్రముఖ జాట్ నేత గహ్లోట్ బీజేపీలో చేరిన వెంటనే ఆయన స్థానంలో ఢిల్లీ నాంగ్లోయ్ ప్రాంతానికి చెందిన జాట్ నాయకుడు రఘువీందర్ షోకీన్‌ను ప్రోత్సహించాలని ప్రాంతీయ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలోని జాట్ ఓటర్లలో తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి మటియాలా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోమేష్ షోకీన్‌ను కూడా ఆప్ చేర్చుకుంది.

Tags:    

Similar News