రాజ్ భవన్ పరిసరాల్లో పోలీసులు కనిపించొద్దు: గవర్నర్

బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి తీసుకుని వస్తున్న ప్రజాప్రతినిధులను రాజ్ భవన్ లోపలికి రాకుండా అడ్డుకోవడంపై..

Update: 2024-06-17 11:36 GMT

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక నివాసం అయిన రాజ్ భవన్ నుంచి పోలీస్ ఔటో పోస్టును తీసి వేయాల్సిందిగా ఆదేశించారు. రాజ్ భవన్ లోని నార్త్ గేట్ సమీపంలోని ఉన్న ఈ ఔట్ పోస్టు ను ఎత్తివేసి దాని స్థానంలో ‘జన్ మంచ్’ (ప్రజావేదిక) ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.

" రాజ్‌భవన్‌లో మోహరించిన పోలీసు అధికారులను, ఇన్‌చార్జి అధికారితో సహా వెంటనే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని గవర్నర్ ఆదేశించారు" అని ఒక అధికారి పిటిఐకి తెలిపారు.
సుబేందు అధికారిని రానివ్వని పోలీసులు
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి బీజేపీ నాయకుడు సుబేందు అధికారి రాజ్ భవన్ కు రాగా పోలీసులు ఆయనను లోపలికి రానివ్వలేదు. ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్న కూడా పోలీసులు లోపలికి రానివ్వకపోవడంతో గవర్నర్ పోలీసు ఔట్ పోస్టు ను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
గవర్నర్ హౌస్ వెలుపల ఐపీసీ సెక్షన్ 144 అమలులో ఉండటంతో సుబేందు అధికారిని లోపలకు అనుమతివ్వలేదని పోలీసులు అంటున్నారు. దీనిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబేందు అధికారిని పోలీసులు ఏ కారణంతో అడ్డుకున్నారో చెప్పాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బెనర్జీకి లేఖ రాశారు.
గవర్నర్‌ను గృహనిర్బంధం చేస్తున్నారా.. హైకోర్టు
గవర్నర్ ను కలవడానికి ప్రజాప్రతినిధులను కలవకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ ను ఏమైనా గృహ నిర్భంధం చేశారా అని బెంగాల్ సర్కార్ ను ప్రశ్నించింది. గవర్నర్ కార్యాలయం అనుమతి ఇచ్చిన తరువాత కూడా ఎందుకు ప్రజాప్రతినిధులను కలవనీయకుండా చేస్తున్నారని మొట్టి కాయలు వేసింది.
ఎన్నికల తరువా త జరిగిన హింస గురించి గవర్నర్ ఎదుట ప్రస్తావించడానికి వెళ్లామని, ఇందుకోసం గవర్నర్ కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నామని కానీ పోలీసులు నన్ను లోపలికి అనుమతించలేదని సుబేందు అధికారితో పాటు మరో వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది.
అయితే బీజేపీ వ్యాఖ్యలను అధికార టీఎంసీ ఖండించింది. ఎన్నికల తరువాత రాష్ట్రం ప్రశాంతంగా ఉందని వ్యాఖ్యానించింది. బీజేపీ రాజకీయ కక్షతో ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.


Tags:    

Similar News