బెంగాల్: మూతపడుతున్న జూట్ పరిశ్రమలు

భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడిపదార్థాల కొరత

Update: 2025-12-24 10:08 GMT
ముడి జనపనార

పశ్చిమ బెంగాల్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది జనపనార పరిశ్రమ. భారత్- బంగ్లాదేశ్ మధ్య వివాదం తీవ్రతరం కావడంతో ఇప్పటికే రెండు జూట్ పరిశ్రమలు మూతపడ్డాయి.

ఇంకా అనేక సంస్థలు మూసివేత అంచుకు చేరుకున్నాయి. దిగుమతులు, ఎగుమతులపై రెండు దేశాలు తమ విధానాలను కఠినతరం చేయడంతో జనపనార పరిశ్రమలలో ముడిపదార్థాల కొరత, పెరుగుతున్న ఖర్చులు, మిల్లులు, రైతులు, కార్మికులలో అనిశ్చితికి కారణమవుతోంది.

ముడిపదార్థాల కొరత..
ఉత్తర 24 పరగణాల జిల్లాలో భట్పారాలోని జగత్థాల్ జ్యూట్ మిల్లు, హౌరా జిల్లాలోని బేలూరులోని మహాదేవ్ జ్యూట్ మిల్లు మూసివేయడం వల్ల దాదాపు 5 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రెండు మిల్లుల యాజమాన్యాలు ముడి పదార్థాల కొరత కారణంగా మూసివేతకు ప్రధాన కారణమని నోటీసుల్లో పేర్కొన్నాయి.
‘‘ముడిపదార్థాల కొరత కారణంగా జనపనార మిల్లు నిరవధికంగా మూసివేయబడింది’’ అని జగద్దల్ జ్యూట్ నడుపుతున్న మిల్లు గేట్ వెలుపల సోమవారం వేలాడదీసిన నోటీసుల్లో పేర్కొన్నారు.
ముడి జనపనార ధరలు బాగా పెరగడం వల్ల మిల్లును నిర్వహించడానికి జనపనారను సేకరించలేకపోతున్నామని మిల్లు అధికారి ఒకరు తెలిపారు.
‘‘ఈ ఆకస్మిక బంద్ వల్ల వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ముడి సరుకు కొరతను పరిష్కరించకపోతే ఇంకా మిల్లులు మూతపడే ప్రమాదం ఉంది. లెక్కలేనన్నీ కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడింది’’ అని మిల్లు కార్మికుడు నబీన్ కుమార్ అన్నారు.
ముడి జనపనార ఎగుమతిపై ఆంక్షలు..
బంగ్లాదేశ్ ఇటీవల ముడి జనపనార ఎగుమతులపై నిషేధం విధించిన కారణంగా దేశంలో జనపనార కొరత ఏర్పడింది. బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 8న ముడి జనపనార ఎగుమతులను షరతులతో కూడిన ఆమోదం కింద చేర్చింది. ఇది ఎగుమతులు నిలిచిపోవడానికి కారణమైంది. ఈ చర్యతో భారతీయ జనపనార మిల్లులకు ఇబ్బందిగా మారింది.
బెంగాల్ లోని పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ ఎగుమతులను కఠినతరం చేయడానికి ముందు భారత్ లోని ముడిజనపనార జూలైలో టన్నుకు దాదాపు రూ. 60 వేల వద్ద ట్రేడవుతుంది.
ఆంక్షలు అమలులోకి వచ్చిన తరువాత డిసెంబర్ లో ధరలు టన్నుకు దాదాపు రూ. 1,10,000 కి పెరిగాయి. బంగ్లాదేశ్ ఎగుమతి పరిమితి తరువాత సరఫరాలో అంతరాయం ఈ నాటకీయ పెరుగుదలకు ప్రత్యక్ష కారణమని చెప్పవచ్చు.
బంగ్లాదేశ్ ఏకపక్షంగా ముడి జనపనార ఎగుమతిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం దేశంలో కొరతకు దారితీసిందని, దీనివల్ల దేశీయ మార్కెట్లో ధరలు గణనీయంగా పెరిగాయని ఇండియన్ జ్యూట్ మిల్స్ అసోసియేషన్ (ఐజేఎంఏ) ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది.
భారత్ ఆంక్షలు..
బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తులపై ఆంక్షలు విధించాలని ఏప్రిల్ లో భారత్ డైరేక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) తీసుకున్న చర్య నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనలు భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న ల్యాండ్ పొర్టుల ద్వారా దిగుమతులను నిషేధిస్తాయి. అన్ని షిప్ మెంట్ లను మహారాష్ట్రలోని ‘నవా శేశా’ పోర్ట్ ద్వారా ప్రత్యేకంగా మళ్లించాలి.
ఇది నేసిన బట్టలు, పురిబెట్టు, తాడు, బస్తాలు, ఇతర బాస్ట్ ఫైబర్ వస్తువులు వంటి వస్తువులను ప్రభావితం చేస్తుంది. ఇది రవాణా, లాజిస్టికల్ సమస్యలకు దారితీసింది.
గతంలో పశ్చిమ బెంగాల్ లోని జనపనార ఉత్పత్తి ప్రాంతాలలో వాణిజ్యం ల్యాండ్ కస్టమ్స్ పోస్టుల ద్వారా సాగేది. దీనివలన ఖర్చులు తక్కువగా, డెలీవరి సరైన సమయానికి వేగంగా జరిగేవి.
జల సంధి
భారత జనపనార ఉత్పత్తిలో ఎక్కువ భాగం దోహదపడే పశ్చిమ బెంగాల్ లో జనపనార మిల్లులు ఈ పరస్పర వాణిజ్య పరిమితుల ప్రత్యక్ష ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
రాష్ట్రంలో ముడి జనపనార నిల్వ 4 లక్షల బేళ్ల కంటే తక్కువకు పడిపోయింది. ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల కార్యకలాపాలకు మాత్రమే సరిపోతుంది. ముడి సరుకు ఖర్చులు పెరగడం లాభాల మార్జిన్లు తగ్గిస్తోంది.
అదేసమయంలో తుది ఉత్పత్తుల ధరలపై నియంత్రణ పరిమితి ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఐజేఎంఏ ప్రకారం.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. పశ్చిమ బెంగాల్ లోని సగానికి పైగా మిల్లులు మార్చి 2026 నాటికి మూసివేయాల్సి ఉంటుందని దీని వలన 4 లక్షల మందికి పైగా ప్రత్యక్ష మిల్లు కార్మికులు ప్రమాదంలో పడతారు. వీరితో పాటు సంబంధిత పరిశ్రమలలో పనిచేస్తున్న అనేక మంది ఇతర విభాగాల వారు కూడా ప్రమాదంలో పడతారు.
బెంగాల్ లోని జనపనార పండించే ప్రాంతాల రైతులు ఈ సంక్షోభ ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. నాడియా, ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ వంటి జిల్లాలు పంట ధరలు, సేకరణకు సంబంధించి అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి.
2024-25 సీజన్ లో ఉత్పత్తి చేయబడిన సుమారు 70 లక్షల బేళ్లలో కేవలం 6.24 లక్షల బేళ్లను మాత్రమే జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధరకి కొనుగోలు చేసింది. మిగిలిన వాటిని తక్కువ ధరకు మార్కెట్లలో విక్రయించాల్సి వచ్చింది.
‘‘ఈ సీజన్ లో మా జనపనార ను మద్దతు ధరకు అమ్మడం తప్ప మాకు వేరే మార్గం లేదు. జనపనార ఇకపై సురక్షితమైన పంటగా అనిపించడం లేదు. కాబట్టి వచ్చే ఏడాది మేము వరి లేదా మొక్కజొన్న పంట వేయాలని ఆలోచిస్తున్నాము’’ అని నదియా జిల్లాలోని కరీంపూర్ కు చెందిన జనపనార పెంపకందారుడు అమీనుల్ ఇస్లాం ఖాన్ అన్నారు.
రైతుల తమ జనపనార ను ఎంఎస్పీ కంటే తక్కువకు విక్రయించాల్సి వస్తున్నప్పటికీ మార్కెట్ డేటా ప్రకారం.. ప్రస్తుత మండి ధరలు క్వింటాలుకు దాదాపు రూ. 8,858 పలుకుతున్నాయి.
ఇది 2025-26 మార్కెటింగ్ సీజన్ కు ఎంఎస్పీ అయిన రూ. 5,650 కంటే చాలా ఎక్కువ. ముడి జనపనార ధరలు పెరగడం రైతులకు పెద్దగా ఉపశమనం కలిగించదని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మిల్లులు, పరిమిత సేకరణ ఎంపికలు జూన్- జూలై నుంచి ప్రారంభమయ్యే తదుపరి మార్కెటింగ్ సీజన్ లో నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని ఖాన్ అన్నారు.


Tags:    

Similar News