‘కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేయండి’
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Update: 2024-06-21 08:14 GMT
లిక్కర్ స్కాంతో ముడిపడివున్నమనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం (జూన్ 21) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టే అవకాశం ఉంది.
కేజ్రీవాల్‌కు నిన్న(జూన్ 20న) బెయిల్ దొరికింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
గతంలో ఈడీ జారీ చేసిన సమన్లపై కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు అన్యాయమంటూ పిటీషన్ వేశారు. కేజ్రీవాల్ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చడంతో.. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈడీ మరోసారి అదే కోర్టులో కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ ఫైల్ చేసింది.