ప్రపంచంలోని 100 వంటకాల్లో హైదరాబాదీ బిర్యానీకి 31వ స్థానం
ప్రపంచంలోని టాప్ 100 వంటకాల జాబితాలో హైదరాబాదీ బిర్యానీతో పాటు మరో మూడు భారతీయ వంటకాలు చోటు దక్కించుకున్నాయి.;
ప్రపంచంలోని టాప్ 100 వంటకాల జాబితాలో హైదరాబాదీ బిర్యానీతో పాటు మరో మూడు భారతీయ వంటకాలు చోటు దక్కించుకున్నాయి. ప్రముఖ గ్లోబల్ ట్రావెల్ అండ్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ఈ జాబితాను రూపొందించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాలకు 12వ స్థానం ఇచ్చింది. ఉత్తమ వంటకాల జాబితాలో ముర్గ్ మఖానీ 29వ స్థానంలో నిలవగా..హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలో 31వ స్థానం దక్కించుకుంది. ఇక చికెన్ 65, కీమా వరుసగా 97, 100వ స్థానాల్లో నిలిచాయి.
మొదటి స్థానంలో కొలంబియన్ వంటకం..
కాల్చిన పందిలో పసుపు బఠానీలు, పచ్చి ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలను నింపి అవుట్‌డోర్ ఓవన్లో కాల్చిన కొలంబియన్ వంటకం ‘లెచోనా’ మొదటి స్థానంలో నిలిచింది.
నేపుల్స్‌కు చెందిన నియాపోలిటన్ పిజ్జా, బ్రెజిల్‌కు చెందిన పికాన్హా, అల్జీరియాకు చెందిన రెచ్టా, థాయ్‌లాండ్‌కు చెందిన ఫానెంగ్ కర్రీ, అర్జెంటీనాకు చెందిన అసడో, టర్కీకి చెందిన కోకర్ట్‌మే కబాబ్, ఇండోనేషియాకు చెందిన రావాన్, టర్కీకి చెందిన కాగ్ కబాబ్, ఇథియోపియాకు చెందిన టిబ్స్ టాప్ 10 జాబితాలో నిలిచాయి.
ఇక నగరంలోని వంటకాల్లో హైదరాబాదీ బిర్యానీదే అగ్రస్థానం. నిజాం వంటశాలల నుంచి ఉద్భవించిన ఒక పాక కళాఖండం బిర్యానీ. ఈ బిర్యానీని బాస్మతి బియ్యం, లేత మాంసంతో తయారుచేస్తారు.