ఎయిర్ పిస్టల్ మిక్సిడ్ డబుల్స్‌‌లో భారత్‌కు కాంస్యం

పారిస్‌లో జరుగుతోన్న ఒలింపిక్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. సోమవారం ఎయిర్ పిస్టల్ మిక్సిడ్ డబుల్స్‌ విభాగంలో మనవాళ్లు కాంస్య పతకాన్ని సాధించారు.

Update: 2024-07-30 10:09 GMT

పారిస్‌లో జరుగుతోన్న ఒలింపిక్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. సోమవారం ఎయిర్ పిస్టల్ మిక్సిడ్ డబుల్స్‌ విభాగంలో మనవాళ్లు కాంస్య పతకాన్ని సాధించారు. భారత జోడి మను భాకర్, సరబ్‌జోత్ సింగ్ దక్షిణ కొరియా జట్టుపై 16-10 తేడాతో గెలుపొందారు. ఆదివారం జరిగిన పోటీలో మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విభాగంలో ఇండియాకు గత మూడు ఒలంపిక్స్‌లో ఒక్క పతకం కూడా రాలేదు. 12 సంవత్సరాల తరువాత భారత్ బోనీ కొట్టింది. తొలి భారతీయ మహిళా షూటర్‌గా మను చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మను 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో తన ప్రత్యర్థులను అధిగమిస్తే హ్యాట్రిక్ సాధించినట్లే.

విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని ప్రశంశలు..

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించిపెట్టిన మను భాకర్ సరబ్జోత్ సింగ్‌ జోడికి భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారులు ఇతర విభాగాల్లోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు.


Tags:    

Similar News