‘విలువైన సభా సమయాన్ని వృథా చేయొద్దు’

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ప్రతిపక్షాలను ప్రధాని మోదీ సూచన..

Update: 2025-12-01 10:00 GMT
Click the Play button to listen to article

పార్లమెంట్(Parliament) శీతాకాల సమావేశాలు(Winter session) సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు పార్లమెంటు( Parliament) వెలుపల ప్రధాని మోదీ(PM Modi) విలేఖరులతో మాట్లాడారు. విలువైన పార్లమెంట్ సమయాన్ని వృథా చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు.

‘ఓటమి నిరాశ నుంచి బయటపడాలి’

‘పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. దేశ ప్రగతి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగలవద్దని కోరుతున్నాను. విపక్షాలు ఓటమి నిరాశను అధిగమించాలి. ప్రజా ప్రయోజకర అంశాలను లేవనెత్తాలి’’ అని మోదీ సూచించారు. బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల పరాజయాన్ని ప్రస్తావిస్తూ బీహార్ ఎన్నికల్లో నమోదైన రికార్డు ఓటింగ్ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు చెందిన కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్, మాణికం ఠాగూర్, ఎస్పీకి చెందిన రాజీవ్ రాయ్ సహా పలువురు ఎంపీలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించడంతో మధ్యాహ్నం 12 గంటలకు, ఆపై మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

పార్లమెంటు సజావుగా సాగేందుకు అందరితోనూ చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెబుతుండగా, ప్రతిపక్ష పార్టీలు S.I.R, జాతీయ భద్రతపై చర్చకు డిమాండ్ చేశాయి.

19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీతో ముగుస్తాయి.

Tags:    

Similar News