పోసాని భార్యకు వైస్ జగన్ ఫోన్

పోసాని అరెస్ట్‌ను జగన్ కూడా తీవ్రంగా ఖండించారు. పోసాని కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.;

Update: 2025-02-27 07:24 GMT

నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధవారం రాత్రి హైదరాబాద్ రాయదుర్గంలోని ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఆయనను ఈరోజు అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె గ్రామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోసానికి పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పీహెచ్‌సీ డాక్టర్ గురుమహేష్.. స్టేషన్‌కు చేరుకున్నారు. అరెస్ట్ సమయంలో తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పోసాని చెప్పడంతోనే వైద్య పరీక్షల కోసం పోలీస్ స్టేషన్‌లోనే వైద్యుడిని పోలీసులు ఏర్పాటు చేశారు. కాగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఘట్టం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు తెరలేపింది. అధికారం అందడంతో తమను విమర్శించిన వారిపై ఎన్‌డీఏ ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని వైసీపీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

పోసాని అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన భార్యను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. పోసాని అరెస్ట్‌ను జగన్ కూడా తీవ్రంగా ఖండించారు. పోసాని కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం జరుగుతున్నది. విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేక పోతుంది అందుకే పోసాని అరెస్టు చేశారు. ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు. పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. ఎన్నికలలో వచ్చిన హామీలను అమలు చేయకుండ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు అమలు చేస్తున్నారు’’ అని ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు ఎస్‌బీ అంజాద్ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఎన్‌డీఏ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

కేసు పెట్టింది జనసేన నేతే..

అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూతురు, నారా లోకేష్‌ను నోటికి వచ్చినట్లు మాట్లాడటంపై జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కేసు నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై జోగిమణి స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపానని చెప్పుకొచ్చారు. ‘‘మా అధినేత మా నాయకుని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటే మేము కూడా మాట్లాడాలి అనుకున్నాం కానీ మా నాయకుడు అలా వద్దని సూచించారు. సంస్కారం అడ్డువచ్చే మేము అలా మాట్లాడలేదు. అతని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. నేను ఎందుకు పుట్టాను ఈ మానవ జన్మ అనే విధంగా మేము కూడా మాట్లాడగలం. గత ప్రభుత్వ హయంలో కూడా పోసానిపై ఫిర్యాదు చేశాం’’ అని తెలిపారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఫిర్యాదులు చేసాం మా ఫిర్యాదులు స్వీకరించలేదు. మా నాయకుడికి మేము భయపడి మేము అలా బూతులు మాట్లాడలేదు. పోసాని మాట్లాడే మాటలు భరించలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. ఆయన మాటలకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సోషల్ మీడియా ఉందని వారి ఇష్టానుసారంగా మాట్లాడితే సమంజసం కాదు. ఇకనుంచి ఎవరైనా సోషల్ మీడియా ఉందని ఎలా అంటే అలా మాట్లాడకూడదు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ ఫిర్యాదు చేశా’’ అని వెల్లడించారు.

Tags:    

Similar News