జిల్లాల్లో పార్టీ ఓనర్లు మీరే

వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.;

Update: 2025-04-29 09:15 GMT

జిల్లాల్లో మీరే పార్టీ. మీరే పార్టీ ఓనర్లు. పార్టీకీ మీరే సర్వస్వం. మీపైనే పార్టీ ఆధారపడి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం కోసం చేసిన పని వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి చేసే కృషి వేరు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బలోపేతానికి చేసే కృషి పార్టీ భవిష్యత్‌పై ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, పెద్దరి రెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాల మీద, భవిష్యత్‌ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాని పై కూడా నేతలతో జగన్‌మోహన్‌రెడ్డి చర్చించారు. దీంతో పాటుగా వైసీపీ బరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యల మీద కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్థేశం చేశారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. జిల్లాల్లో వైసీపీ పార్టీకి ఓనర్లు మీరే. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఉంది. పార్టీని నడిపించడంలో మీరు కీలక పాత్ర పోషించాలన్నారు. నియోజక వర్గాల్లో సమన్వయ కర్తలను ఎప్పటికప్పుడూ మోనటరింగ్‌ చేస్తూ.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేసిందని, ప్రజలకు సేవలు అందించడంలో ఫెయిలయ్యిందని, ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యమాలు చేపట్టాలని జిల్లా అధ్యక్షులకు జగన్‌ సూచించారు. మే నెలలోపు మండల స్థాయి కమిటీలు, జూన్, జూలైలోపల గ్రామ, మునిసిపలిటీల స్థాయి కమిటీలను ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి కమిటీ బలంగా ఉండాలన్నారు. గ్రామ కమిటీలు పూర్తి కాగానే, అక్టోబర్‌లోపు బూత్‌ లెవల్‌ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మనసా, వాచా, కర్మణ పార్టీనే మీకు సర్వస్వం కావాలని అధ్యక్షలకు జగన్‌ ఉద్బోధించారు.
రైతులకు మద్ద ధరను కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, వారి తరపున పోరాటాలు చేసి, వారికి అండగా నిలవాలని సూచించారు. విద్యార్థులు, మహిళలను కూడా కూటమి ప్రభుత్వం మోసిం చేసిందని, వారి పక్షాన వైసీపీ నిలవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి మేలు చేయడం లేదని, అందువల్ల ప్రతి ఒక్కరికీ వైసీపీ అండగా ఉండి వారి పక్షాన పోరాటాలు చేసి అండగా నిలవాలని, ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని దిశా నిర్థేశం చేశారు.
Tags:    

Similar News