తిరుమలకు వైసీపీ పాదయాత్ర..మంగాపురం వద్ద పోలీసుల బ్రేక్

ఎంపీ మిథున్ కోసం కదిలిన పీలేరు యువకుల ధర్నా.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-19 10:24 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుకూంటూ తిరుమలకు ఆ పార్టీ నేతలు పాదయాత్ర చేపట్టారు. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలోని శ్రీనివాస మంగాపురం వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పాదయాత్ర ఆగిపోవడంతో పాటు ట్రాఫిక్ కు కూడా ఇబ్బంది ఏర్పడింది.

రాజంపేట ఎంపీ మిథున్ కోసం వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాదరెడ్డి సారధ్యంలో పాదయాత్ర చేపట్టారు. అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి వైఎస్ఆర్ సీపీ నేతలు చేపట్టిన పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రారంభించారు.

పెద్ద సంఖ్యలో ఉన్న వైసీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి కల్యాణిడ్యాం వద్ద సేదదీరారు. మంగళవారం మళ్లీ ఉదయం తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. శ్రీవారిమెట్ట ద్వారా వెళ్లడానికి వారంతా శ్రీనివాసమంగాపురం వద్దకు చేరుకునే సరికి, అప్పటికే చంద్రగిరి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో కొంతసేపు పాదయాత్ర ఆగిపోయింది.
పోలీసుల ఆంక్షలతో నిరసన
చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం వద్దకు పాదయాత్ర చేరుకుంది. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు ఆంక్షలు విధించారు.
"తిరుమలకు శ్రీవారిమెట్ట మార్గంలో గుంపులుగా కాకుండా, ఒక్కొక్కరుగా వెళ్లాలి" అని డీఎస్పీ ప్రసాద్, సీఐ ఇమ్రాన్ ఆంక్షలు విధించారు. దీంతో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు పాదయాత్ర నిలిపివేశారు. శ్రీనివాసమంగాపురం వద్దే ధర్నాకు దిగారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి 50 మంది కలిసి వెళ్ళడం తప్పా అని వైసీపీ నాయకులు డిఎస్పీని ప్రశ్నించారు. టిటిడి అధికారులు ఇలా రాకూడదని సూచించారని డీఎస్పీ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం తెలియడంతో సత్యవేడు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ నూకపాటి రాజేష్ సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులతో మాట్లాడారు. దాదాపు గంటకు పైగా పోలీసులు అడ్డుకున్నారు.

మార్గమధ్యలో రొంపిచెర్ల మండలం మోటుమల్లెల శివాలయంలో కూడా అయ్యప్పదీక్షలో ఉన్న భక్తులు ఎంపీ మిథున్ రెడ్డి కోసం పూజలు చేశారు.
Tags:    

Similar News