మద్యం కేసులో మిధున్ రెడ్డికి అరెస్ట్ తప్పినట్టే!

వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.;

Update: 2025-04-07 13:30 GMT
YCP MP MIDHUN REDDY
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి సోమవారం (ఏప్రిల్ 7) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ధర్మాసనం పేర్కొంది.
మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ​వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాయన్న సమాచారంతో మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నుంచి తాత్కాలిక ఊరట పొందారు.
Tags:    

Similar News