విశాఖలో మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ 2025

తొలి మ్యాచ్‌కు మంత్రి నారా లోకేష్‌ ముఖ్య అతిథిగా సందడి చేయనున్నారు.;

Update: 2025-09-07 14:56 GMT

మరి కొద్ది రోజుల్లో విశాఖపట్నం క్రికెట్‌ అభిమానులతో సందడి వాతావరణం నెలకొననుంది. మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ 2025 మ్యాచ్‌లకు విశాఖపట్నం నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. మహిళల ప్రపంచ కప్‌ టోర్నీలో దాదాపు ఐదు మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో ఆదివారం మహిళల వరల్డ్‌ కప్‌ ట్రోఫీని ఏసీఏ సభ్యులతో కలిసి ఏసీఏ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సానా సతీష్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఐదు మ్యాచ్‌లు విశాఖలో నిర్వహించనున్నట్లు సతీష్‌ తెలిపారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లు విశాఖపట్నంకు వస్తున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లలో తొలి మ్యాచ్‌కు మంత్రి నారా లోకేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని సానా సతీష్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెటర్లను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్‌ అడుగులు ముందుకు వేస్తున్నారని వెల్లడించారు. కేవలం క్రికెట్‌ ఆటనే కాకుండా తక్కిన క్రీడల్లో కూడా మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సానా సతీష్‌ తెలిపారు.

Tags:    

Similar News