ఎస్‌ఐ నుంచి ఏఎస్పీ స్థాయికి ఎదిగి..ఆ కలతీరకుండానే

దాదాపు 36 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పని చేశారు. ఆమె జీవితంలో రెండు ప్రాముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి.;

By :  Admin
Update: 2025-01-31 10:30 GMT

పోలీసు శాఖలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం అరుదైన విషయం. అందులో మహిళా ఉద్యోగుల్లో చాలా అరుదైన విషయం. ఎక్కువ మంది అధికారులు సీఐ లేదా డీఎస్పీ స్థాయిల్లోనే పదవీ విరమణ పొందుతుంటారు. అలాంటిది ఎస్‌ఐ స్థాయి నుంచి ఏఎస్పీ వంటి ఉన్నత స్థానానికి చేరుకున్నారు ఓ మహిళా పోలీసు అధికారి. అయితే ఆ పదవిలో ఎక్కువ రోజులు పని చేయాలనే కోరిక మాత్రం తీరకుండానే పదవీ విరమణ పొందారు. అదీ కూడా తాను తాను పుట్టి పెరిగి ఓనమాలు దిద్దుకున్న ప్రాంతంలోనే ఉద్యోగం నుంచి రిటైర్మెంట్‌ కావడం విశేషం.

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎల్‌ నాగేశ్వరికి పోలీసు శాఖ అంటే ఎంతో గౌరవం, ఇష్టం. పోలీసు శాఖలోనే తాను ఉద్యోగం చేయాలని కలలకు కన్నారు. తన తండ్రి పోలీసు శాఖలో పని చేస్తున్నందు వల్ల ఆమెకు కూడా అదే శాఖలో ఉద్యోగం సాధించాలని కలలు కనేవారు. ఆమె అనుకున్న విధంగానే 1989లో ఉద్యోగం సాధించి ఎస్‌ఐగా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అడుగు పెట్టారు. అలా ఎస్‌ఐగా కమ్మం జిల్లాలో తన పోలీసు ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ సంత్సరాలు ఉద్యోగ భాద్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆమె ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అలా వివిధ హోదాల్లో పోలీసు శాఖలో పని చేసిన నాగేశ్వరి ఇటీవలె డీఎస్పీ నుంచి ఏఏస్పీగా పదోన్నతి పొందారు. ఎస్‌ఐ స్థాయి నుంచి ఏఎస్పీ స్థాయికి చేరుకున్న మహిళా పోలీసు అధికారిగా ఆమె గుర్తింపు పొందారు.
అయితే ఈ లోగా ఆమె పదవీ విరమణ వయసు కూడా దగ్గరపడింది. అయితే పదవీ విరమణ పొందే సమయానికి ఎక్కడో ఒక చోట విధుల్లో ఉండాలనే ఉద్దేశంతో నాగేశ్వరిని ఆమె పుట్టి పెరిగిన పార్వతీపురం మన్యం జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. పార్వతీపురం పోలీసు శాఖలో అదనపు ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించిచారు. మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే.. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క రోజు మాత్రమే ఆమె అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. గురువారం నాగేశ్వరి అదనపు ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 24 గంటల తర్వాత శుక్రవారం ఆమె విశ్రాంత అదనపు ఎస్పీగా మారిపోయారు. నేడు ఆమె పదవీ విమరణ పొందారు.
నాగేశ్వరి పోలీసు ఉద్యోగ ప్రస్థానంలో మరో విశేషం ఏంటంటే.. ఆమె పుట్టి పెరిగిన ప్రాంతంలో అదనపు ఎస్పీగా రావడం, అక్కడే పదవీ విరమణ పొందటం. నాగేశ్వరి విద్యాభ్యాసం పార్వతీపురంలోనే ప్రారంభమైంది. పార్వతీపురం పట్టణంలోని బాలికల ఆర్సీఎం పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత బొబ్బిలి సీబీఎం పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. విజయనగరంలో ఇంటర్మిడియట్, డిగ్రీ చదువులు పూర్తి చేశారు. తర్వాత 1989లో ఎస్‌ఐగా పోలాసు శాఖలోకి ప్రవేశించారు. రాష్ట్ర విభజన వరకు తెలంగాణ ప్రాంతంలో పని చేసిన ఆమె విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చారు.
Tags:    

Similar News