బ్రాహ్మణి సహకారం లేకపోతే ఏమీ చేయలేను

రెబ్‌బుక్‌ పేరు వింటేనే వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నేతలకు గుండెపోటు వస్తోందని మంత్రి నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.;

Update: 2025-06-25 07:52 GMT

తన భార్య బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏమీ చేయలేనని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మచిలీపట్నంలో బుధవారం ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల గౌరవ భానతో ప్రతి ఒక్కరు ఉండాలన్నారు. మహిళలతో మాట్లాడే విధానం మారాలని సూచించారు. మహిళలను వైసీపీ నాయకులు కించపరిచే విధంగా ఎలా మాట్లాడుతున్నారో చూశామని, కానీ తమ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యే స్థానం ఉందని, మహిళలను గౌరవించే పరిస్థితే ఉంటుందన్నారు. సమాజంలో మహిళల పట్ల మార్పులు రావాలని, కానీ చట్టాలు, డబ్బులతో ఆ మర్పు రాదని, ప్రజల్లో మార్పులు రావాలన్నారు. తన భార్య బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏమి చేయలేనని, తన తల్లి నారా భువనేశ్వరి త్యాగం చేయకపోతే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయలేరని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు గౌరవం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. తమ పిల్లలను చదివించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ తల్లి కూడా ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో తల్లికి వందనం అమలు చేశామని లోకేష్‌ వెల్లడించారు. రెడ్‌బుక్‌ పేరు వింటేనే వైసీపీ నేతలకు గుండెపోటు వస్తోందని లోకేష్‌ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌కు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వర్ల కుమార్‌రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, ఇతర టీడీపీ నాయకులు లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేతలు లోకేష్‌కు హారతి ఇచ్చారు. త్వరలో పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
Tags:    

Similar News