‘జగన్ ఓడిపోవడం ఖాయం’.. ప్రశాంత్ కిషోర్ లెక్కేంటి..

ఆంధ్ర ఎన్నికలు 2024లో వైసీపీ ఓడిపోవడం తథ్యమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బల్లగుద్ది చెప్తున్నారు. అసలు ఆయనకు అంత నమ్మకం ఏంటి?

Update: 2024-05-20 06:40 GMT

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందన్న అంశంకన్నా ఏపీలో ఎవరు సీఎం అవుతారు అన్న విషయమే హాట్ టాపిక్‌గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చనీయాంశంగా ఉంది. జగనే వస్తాడంటూ కొందరు మేధావులు చెప్తున్న మాటలు ఈ చర్యలను మరింత అధికం చేస్తున్నాయి. అదే సమయంలో ఆంధ్రలో వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమే అని, వైసీపీకి ఓటమి తప్పదంటూ కొందరు విశ్లేషకులు గంటాపథంగా చెప్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. వైసీపీ ఎట్టిపరిస్థితుల్లో గెలవదని, జగన్ ఓటమి ఖాయమంటూ చేస్తున్న వ్యాఖ్యలు మరింత కీలకంగా మారాయి. 2019 ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేయడంలో ప్రశాంత్ కిషోర్, ఐప్యాక్ ప్రధాన పాత్ర పోషించాయి. ఆ తర్వాత ఐప్యాక్ నుంచి పీకే తప్పుకున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల మొదలు నుంచి కూడా ఆంధ్రలో జగన్ ఓడిపోవడం ఖాయమంటూ పీకే చెప్తున్నారు. ఈ విషయాన్ని పీకే అంత కాన్ఫిడెన్స్‌తో ఎందుకు చెప్తున్నారన్న ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది.

‘వైసీపీ చాలా తప్పులు చేసింది’

తాజాగా మరోసారి ఏపీ ఎన్నికలపై స్పందించిన పీకే.. ఈసారి ఆంధ్రలో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోతుందంటూ జోస్యం చెప్పారు. ‘‘ఐదేళ్ల పాలనలో వైసీపీ చాలా తప్పులు చేసింది. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని గెలిచిన ప్రభుత్వాలు ఇప్పటివరకు లేదు. సంక్షేమంత పాటు అభివృద్ధి కూడా చేస్తేనే ఓటర్లు గెలిపిస్తారు. వైసీపీ హయాంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. అందుకే ఈసారి ఓటర్లు టీడీపీవైపు చూస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఓటర్లు చాలా వరకు టీడీపీకే ఓటు వేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఈసారి జగన్ ఓడిపోతారు. అందులో ఎటువంటి సందేహం లేదు’’ అని మరోసారి పునరుద్ఘాటించారు.

వైసీపీ పార్టీ లెక్క అది

‘‘2024 ఎన్నికల నాటికి ఆంధ్రలో పురుష ఓటర్లు కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. పురుషులు 1.64 కోట్లు కాగా మహిళలు 1.69 కోట్లు. దీంతో 2024 ఎన్నికలపై మహిళా ఓటర్లు ప్రభావం అధికంగా ఉంటుంది. తమ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన మహిళలు తమకే ఓటు వేస్తారని, అందుకే పోలింగ్ ప్రారంభం నుంచి క్యూలో నిల్చుకుంటున్నారని వైసీపీ అంచనా వేస్తోంది. మహిళా ఓటర్లో 70శాతం మంది తమకు ఓటు వేసినా విజయం తమనే వరిస్తుందని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ పాలనలో వారి పథకాల ద్వారా లబ్దిపొందిన మహిళలు కేవలం 65 లక్షల మంది మాత్రమే. వారు కాకుండా మిగిలిన 95 లక్షల మంది తమ వెంట ఉన్నారని సైకిల్ పార్టీ గట్టిగా చెప్తుంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ఈసారి వైసీపీకి గట్టి దెబ్బ కొట్టనున్నాయి’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్.

‘టీడీపీ వైపే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు’

గత ఎన్నికల్లో వైసీపీ అండగా నిలిచినా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఈసారి రూట్ మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. ‘‘2014, 2019 ఎన్నికల్లో ఎస్‌సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ హవా నడిచింది. కానీ ఈసారి అక్కడ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. ఆ నియోజకవర్గాలన్నీ కూడా టీడీపీవైపు మొగ్గు చూపగుపనున్నాయి. పోలింగ్ ప్రతిసారి ఏపీలో అధికార పార్టీ ఓడిపోయింది. ఆ సందర్భాలు అనేకం మనం గమనించొచ్చు. ఈసారి కూడా ఆంధ్రలో అదే రిపీట్ అవుతుంది. పోలింగ్ అధికంగానే అయింది. అంటే ఈసారి కూడా అధికార పార్టీ ఓడిపోనుందన్న సూచనలు అక్కడే వస్తున్నాయి’’అని తన వివరించారు.

ఎందుకిలా!

2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పడు రివర్స్ గేర్ ఎందుకు వేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐప్యాక్ నుంచి పీకే బయటకు వచ్చేయడం వెనక సీఎం జగన్ హస్తం ఉందని, అందుకే జగన్‌కు పీకే వ్యతిరేకమయ్యారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే మరెక్కడా కూడా తాను గెలిపించిన ప్రభుత్వం గెలుస్తుందా, ఓడుతుందా అంటే ప్రశ్నను దాటేసే పీకే.. ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం అలా కాకుండా వైసీపీ ఓడిపోతుందని బల్లగుద్ది చెప్తున్నారు. ఇదే సమయంలో కూటమి నుంచి పీకేకి భారీ మొత్తంలో ముట్టిందని, కేవలం మీడియా ముందు వైసీపీ ఓడిపోతుందని పదేపదే చెప్తే సరిపోతుందని, పీకే ద్వారా ప్రజలను మానసికంగా దెబ్బతీయాలని కూటమి ఈ పన్నాగం పన్నిందని కూడా వైసీపీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్ర ఎన్నికల విషయంలో పీకే అంచనా ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Tags:    

Similar News