ఇప్పుడందరూ కడప వైపే చూస్తున్నారెందుకు?
కడప లోక్‌సభ స్థానం నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ద్వారా షర్మిల ఎన్నికల పోరాటాన్ని నేరుగా తన సోదరుడు వైఎస్ జగన్ గడప వద్దకు తీసుకెళ్లారు.
ఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవేళ మరోసారి నామినేషన్ వేయబోతున్నారు. ఘనంగా జరుగుతున్నాయి. 22వందల కిలోమీటర్ల బస్ యాత్ర పూర్తి చేసి ఆయన పులివెందుల బయలుదేరారు. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కడప జిల్లా నుంచీ అదీ తన సొంత చెల్లెలు నుంచి ఈసారి ఆయన విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఎన్నికల పోరాటాన్ని నేరుగా తన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడప వద్దకు తీసుకెళ్లారు. కడప జిల్లా 2014, 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపికి, అంతకుముందు ప్రత్యేకంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. కుటుంబంలో దూరపు బంధువుల మధ్య ఎన్నికల పోరు జరిగినా.. సొంత అన్నా చెల్లెళ్లు ఒకళ్లపై ఒకళ్లు సవాళ్లు విసురుకోవడం ఇదే తొలిసారి. దీంతో కడప దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.