లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు ఎవరు
ఇప్పటికే ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను విచారిస్తోన్న సిట్ అధికారులు సజ్జల శ్రీధర్‌రెడ్డిని కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేశారు.;
By : The Federal
Update: 2025-05-15 09:24 GMT
లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్ అధికారులు విచారణల మీద విచారణలు జరుపుతున్నారు. ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు జారీ చేయడం, సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణలు చేపట్టడం నిరంతర ప్రక్రియగా మారింది.
ఈ కేసులో నిందితులుగా ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డితో పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఓఎస్‌డీగా పని చేసిన కృష్ణమోహన్‌రెడ్డిలను గురువారం రెండో రోజు విచారిస్తున్న సిట్ అధికారులు, మరో నిందిడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జైలు నుంచి శ్రీధర్‌రెడ్డిని విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ ఆఫీసుకు తరలించారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. లిక్కర్ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డిని కూడా కీలక వ్యక్తులుగా సిట్ అధికారులు భావిస్తున్నారు.
గురువారం సాయంత్రం వరకు సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. సజ్జల శ్రీధర్‌రెడ్డి విచారణలో అడగాల్సిన ప్రశ్నల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్‌లో అక్రమాలకు ఎలా పాల్పడ్డారు, అక్రమంగా నగదును ఎలా పోగేశారు, అలా పోగేసిన నగదును ఎలా తరలించారు, ఏయే రంగాలలో ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టారు, అసలు మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు, అనే కోణాల్లో సిట్ అధికారులు విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది.