ఎక్కడ చూసినా ‘దేవర’ మాటే.. వచ్చే నెల ఏడు వరకు టిక్కెట్ల ధరలు పెంపు
దేవర కోసం టాలీవుడ్‌లోనే కాదు తమిళ, మలయాళీ, కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. మరి జూ. ఎన్టీఆర్ క్రేజ్ అలాంటిది మరి.
Byline : Vijayakumar Garika
Update: 2024-09-26 09:02 GMT
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ, మలయాళీ , కన్నడ సినీ పరిశ్రమలతో సహా భారత దేశంలో అతి పెద్ద మూవీ మార్కెట్ అయిన బాలీవుడ్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది. క్యాలెండర్‌లో సెప్టెంబరు 27 తేదీ ఎప్పుడు మారుతుంది, గురువారం పోయి శుక్రవారం ఎప్పుడొస్తుందాని ఎదురు చూస్తున్నారు.
సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని సహజంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తారు. ఆ సినిమాలో నటించిన నటీనటులతో పాటు కలిసి పని చేసిన టీమంతా వెయిట్ చేస్తుంది. కానీ దేవర ఆ సీన్‌ను తారు మారు చేస్తోంది. ప్రేక్షకులు, అభిమానులు, నటీనటులు, టీమ్‌తో పాటు ఇరత రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమకు చెందిన వారంతా ఎదురు చేస్తుంటడం ఇప్పుటు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రీ రీలీజ్‌కు ముందు నుంచే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల రిలీజైన దేవర ట్రైలర్‌ను కోట్ల సంఖ్యలో వీక్షించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రియులను అలరించేందుకు ‘దేవర’ సిద్దమైంది. యంగ్‌టైగర్, జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బామ్మ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్ నుంచి దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఉత్కంఠకు తెరదించుతూ మరికొన్ని గంటల్లోనే.. అంటే సెప్టెంబర్ 27న ఈ సినిమా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో టెకెట్ల ధరలను కూడా పెంచేశారు. వచ్చే నెల ఏడో తేదీ వరకు ఈ టికెట్ల ధరలు కొనసాగనున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న రెండో సినిమా దేవర. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ అయింది. దీంతో దేవరపైనా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ నటించింది. ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్‌గా యాక్ట్ చేశారు.