జీఎస్టీ మీద పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే

ఈ సంస్కరణలు దేశంలోని కోట్ల కుటుంబాలకు కష్టాలను తగ్గిస్తాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.;

Update: 2025-09-04 07:09 GMT

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల మీద తీసుకున్న నిర్ణయం మీద ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. జీఎస్టీ శ్లాబుల రేట్ల సవరణలను తాను స్వాగిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న స్వాంత్య్ర దినోత్సవం నాడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ ఎర్రకోట నుంచి ఇచ్చిన హామీని నెరవేర్చారని సోషల్‌ మీడియా వేదికగా పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా సంస్కరణలను ముందుకు తీసుకొచ్చిందని అన్నారు. దీని వల్ల భారత దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులకు భారీగా ఉపశమనం కలుగుతుందన్నారు. విద్య, బీమాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడంతో ప్రజలపై భారం ఉండదన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పేదల, మధ్యతరగతి ప్రజల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది పేద కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయన్నారు. భారత దేశ ప్రజల సంక్షేమం కోసం సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు జీఎస్టీ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచారని, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ జీఎస్టీ సంస్కరణలు భారత దేశానికి నిజమైన దీపావళి బహుమతిగా నిలుస్తాయని పవన్‌ కల్యాణ్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.


Tags:    

Similar News