కోహ్లీ వీడ్కోలుపై చంద్రబాబు, జగన్‌లు ఏమన్నారంటే

ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.;

Update: 2025-05-12 13:59 GMT

టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు స్పందించారు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో భారత దేశం క్రీడా చర్రితలో ఓ అద్భుతమైన అధ్యాయం ముగిసిందని సీఎం చంద్రబాబు పేర్కొనగా, భారత దేశ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లీ ఒకరని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ఏమన్నారంటే..
స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌తో భారత క్రీడా చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. విరాట్‌ కోహ్లీ భారత దేశానికే గర్వకారణం. క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ డిసిప్లెయిన్, ఆటపైన విరాట్‌కు ఉన్న మక్కువ, అభిరుచి చాలా మంది క్రీడాకారుల్లో స్పూర్తిని నింపాయి. విరాట్‌ కోహ్లీ తన రిటైర్మెంట్‌ అనంతర ప్రయాణం కూడా విజయపథంలో సాగాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

జగన్‌ ఏమన్నారంటే..
భారత దేశ క్రికెట్‌ హిస్టరీలో అత్యుత్తమైన ఆటగాళ్లలో విరాట్‌ ఒకరు. విరాట్‌ కోహ్లీ ఆట చూటడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. క్రికెట్‌ పట్ల విరాట్‌ కోహ్లీకి ఉన్న అభిరుచి, ఆటలో కోహ్లీ స్థిరత్వం, అత్యుత్తమ ప్రదర్శన కోసం విరాట్‌ దాహం సాటిలేనివి. విరాట్‌ కోహ్లీ రికార్టులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడుతాయి. విరాట్‌ కోహ్లీ వారసత్వం భవిష్యత్‌ తరాలకు స్పూర్తినిస్తూనే ఉంటుంది. విరాట్‌ కోహ్లీ తన ఫ్యూచర్‌ ప్రయత్నాల్లో విజయవంతం కావాలి అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News