పోరాటాల ద్వారానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం
అన్ని పార్టీల నాయకులు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ముక్తకంఠంతో వ్యతిరేకించారు.;
పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ అలాంటి పోరాటాలతో ద్వారానే ప్రైవేటీకరణ కాకుండా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని çపలువురు వక్తలు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై విజయవాడ ఎంబీ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి సీఎం, సీపీఐతో పాటు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్రైవేణీకరణపై బీజేపీ నాటకాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఏపీలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీకి వత్తాలు పలుతుకున్నారు. 2021లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి లేఖ రాశారు. ఒకప్పుడు వాజ్‌పేయి హయంలో ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటే అడ్డుపడ్డాను అని గొప్పలు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు ? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందంటే ఆంధ్ర ఎంపీలు ఇచ్చిన మద్దతుతోనే. టీడీపీ, జనసేన బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకుంటే.. వైసీపీ రహస్య పొత్తు పెట్టుకుందని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం అందరు కలిసి బీజేపీని మోస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీల మధ్య ఐకమత్యం లేదు. పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నాం అంటే ఒక్కరు మాట్లాడలేదు. పోలవరం ఎత్తు తగ్గించాం అని చెప్పినా ఐకమత్యం లేదు. ప్రజాస్వామయంగా ఎన్నికైన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. విశాఖ స్టీల్ భూముల విలువ రూ.4 లేదా 5 లక్షల కోట్లు. 20 వేల ఎకరాల కోసం ప్రధాని మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారు. అందుకే రా మెటీరియల్ ఇవ్వడం లేదు... క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు..లాజిస్టిక్స్ ఇవ్వడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ఎంపీలు అందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని వెల్లడించారు. ï